వడమాలపేట బాణసంచ దుకాణంలో ఎగసి పడిన మంటలు

వడమాలపేట  బాణసంచ దుకాణంలో ఎగసి పడిన మంటలు

తిరుపతి:

తిరుపతి జిల్లా వడమాలపేట మండల కేంద్రంలో శనివారం రాత్రి 11:30 గంటల ప్రాంతంలో ఊరు చివర ఏర్పాటుచేసిన  టపాకాయల దుకాణంలో  అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

మంటలు చెలరేగి  పెద్ద ఎత్తున  చుట్టూ ప్రక్కల ఉన్న దుకాణాలకు  వ్యాపించడంతో  భారీ ఎత్తున  అగ్ని జ్వాలలు ఎగసిపడ్డాయి.

స్థానికులు భయాందోళనలతో పరుగులు తీశారు.

స్థానికులు మండల పోలీస్ స్టేషన్ కి మరియు  అగ్నిమాపక సిబ్బందికి సమాచారం  అందించగా హుటాహుటిన  అక్కడ చేరుకొని మంటలను అదుపు చేశారు. 

ప్రమాదానికి గల కారణాల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.