తల్లి తండ్రులు కోల్పోయిన ముగ్గురు బాలికలకు అండగా మాధవి వర్మ, మూదుండి రాజేశ్వరి.
నెల్లిమర్ల:
గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విజయనగరం జిల్లా నియోజకవర్గానికి చెందిన తల్లిదండ్రులు కోల్పోయిన ముగ్గురు ఆడపిల్లలు బ్రైట్ ఫ్యూచర్ హోమ్ లో ఉన్నారని తెలుసుకొని ముగ్గురు పిల్లలను వైస్సార్సీపీ ఉత్తరాంధ్ర మహిళా శిషు సంక్షేమ శాఖ ఛైర్పర్సన్ మాధవి వర్మ, సింహాచలం ట్రస్ట్ బోర్డ్ డైరెక్టర్ మూదుండి రాజేశ్వరి కలిసి
విజయనగరం జిల్లా కలెక్టర్ తో మాట్లాడి ముగ్గురు పిల్లలు బంగారు భవిష్యత్తు కోసం ఉన్నత విద్య కోసం విజయనగరం జిల్లా నెల్లిమర్ల లోని కస్తూరిబాయి గాంధీ బాలిక విశ్వవిద్యాలయంలో చేర్పించారు అని తెలిపారు.
ఈ ముగ్గురు పసిపిల్లలకు ఏ కష్టం వచ్చినా నేను అండగా నిలబడతానని భరోసా ఇవ్వడం జరిగింది అని తెలిపారు.ఈ కార్యక్రమంలో రెండు రోజులుగా ఈ ముగ్గురు పిల్లలకు తోడుగా ఉత్తరాంధ్ర మహిళా శిశు సంక్షేమ శాఖ చైర్పర్సన్ మాధవి వర్మ,మూదుండి రాజేశ్వరి
సింహాచలం ట్రస్ట్ బోర్డ్ డైరెక్టర్ పాల్గొన్నారు.

