రవాణాశాఖలో రాష్ట్ర సంఘం ఎన్నికలు- యం రాజుబాబు
బందర్ రోడ్డు:
వచ్చే నవంబర్ లో రవాణాశాఖ నాన్ టెక్నికల్ ఉద్యోగుల రాష్ట్ర సంఘం ఎన్నికలు జరగనున్నాయని, రాష్ట్రంలోని నాలుగు జోన్లల్లో ఎన్నికైన ప్రతినిధులు, రాష్ట్ర రవాణాశాఖలో ఎన్నికైన ప్రతినిధులు కలసి రాష్ట్ర సంఘంను ఎన్నికోవడం జరుగుతుందని రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షుడు యం. రాజుబాబు తెలిపారు.
స్థానిక బందర్ రోడ్డు లోని రవాణాశాఖ ఉద్యోగుల సంఘ భవనంలో బుధవారం నాడు జోనల్ అధ్యక్షుడు యం. రాజుబాబు అధ్యక్షతన సంఘం జోనల్ కార్యవర్గ సమావేశంను,నిర్వహించారు.ఈ సమావేశంలో జోన్2 లోని ఉద్యోగసంఘ నాయకులు, ఉద్యోగులకు సంబంధించిన విషయాలను జిల్లాలవారిగా అభిప్రాయాలను తెలియజేసారు. నవంబర్ లో జరగబోయే రాష్ట్ర సంఘం ఎన్నికలలో జోన్2 నుండి ప్రాతినిధ్యం వహించాలని జోన్2 అధ్యక్షుడు యం రాజుబాబును జోనల్ కార్యవర్గ సభ్యులు ఉద్యోగులు కోరారు. అనంతరం రాజుబాబు మాట్లాడుతూ జోనల్ స్థాయిలో ఉద్యోగులు చేసుకున్న అర్జీలను పరిష్కరించేవిధంగా, అలాగే ఖాళీలైన పోస్టులలో పదోన్నతులను కల్పించే విధంగా సంబంధిత అధికారులతో మాట్లాడతామన్నారు. రాష్ట్ర సంఘం ఎన్నికలు వచ్చే నవంబర్ లో నిర్వహించడం జరుగుతుందని, నూతన రాష్ట్ర కార్యవర్గం ఏర్పడిన తర్వాత శాఖఫరంగా ఉద్యోగులకు సంబంధించిన పాలసీ విషయాలపై చర్చించి, వాటిని పరిష్కరించే విధంగా త్వరలో కార్యాచరణ చేస్తామన్నారు. జోనల్ స్థాయిలో పెండింగ్ లో ఉన్న విషయాలపై కూడా రాష్ట్ర రవాణాశాఖకు, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరుగుతుందన్నారు. శాఖలోని ఆదాయాన్ని చేకూర్చే విధానాలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వివరిస్తామన్నారు. తద్వారా ఉద్యోగులకు కూడా ప్రయోజనం చేకూరుతుందని రాజుబాబు అన్నారు. ఉద్యోగుల సంబంధించి ప్రభుత్వం జారీచేసిన సర్కులర్లు, జీవోలను పుస్తకాలు రూపంలో ముద్రించి, జనవరి నెలలో శాఖలోని ప్రతి ఒక్కరికి అందించే విధంగా సంఘం పూర్వపు అధ్యక్షుడు ఐ రఘుబాబుతో కార్యచరణ చేస్తామన్నారు. నూతన సంవత్సరంనకు సంబంధించి డైరీని కూడా జనవరిలో ఉద్యోగులకు అందే విధంగా చూస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో జోనల్ కార్యవర్గ సభ్యులు జి ఉషసుందరి, కెవివి నాగమురళి, బి మధుసూదన్ రావు, కె సతీష్ , జోనల్ నాయకులు అబ్దుల్ సత్తార్, యం ఆనంద్ కుమార్, బి చంద్రశేఖర్, కేవీఆర్ రాజు, జోగరావు మరియు ఈసీ మెంబర్స్ ఉద్యోగులు ఉన్నారు.

