షార్ట్ సర్క్యూట్ వల్ల దగ్ధమైన ఇల్లు ని సందర్శించిన ఎమ్మెల్యే గణబాబు.
కంచరపాలెం:
56 వార్డ్, గవర కంచరపాలెం,ఆంజనేయస్వామి గుడి ఎదురుగా బొడ్డేటి.గిరి వారి నివాసం గత శనివారం షార్ట్ సర్క్యూట్ వల్ల దగ్ధమైన ఇల్లు ని సందర్శించిన ఎమ్మెల్యే గణబాబు, వార్డ్ కార్పొరేట్ సరగడం రాజశేఖర్, మల్ల శంకర్రావు, వెంకట్రావు, బలరాం మరియు ముఖ్య నాయకులు.
ఈ సంఘటనపై తగు చర్యలు తీసుకోవాలని అలాగే విచారణ చేపట్టి తగు నష్టపరిహారాన్ని కూడా అందజేయాలని సంబంధిత తహసీల్దార్ ని కోరారు, అదేవిధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులతో మాట్లాడి షాక్ సర్క్యూట్ గల కారణాలను తెలుసుకోవాలని మరియు ఆ వీధిలో కానీ ఆ ఏరియాలో ఇతర ప్రజానీకానికి ఇటువంటి సమస్య పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆ ఏరియా నుంచి సప్లై వచ్చే ట్రాన్స్ ఫారం ని మరలా తనిఖీ చేయాలని ఆదేశించారు.


