కన్న పిల్లలను గొంతు కోసి చంపిన కసాయి తండ్రి.
నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలం ఎత్తం గ్రామ సమీపంలోని అడ్డగట్టు సమీపంలో దారుణం చోటుచేసుకుంది.ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలను విచక్షణారహితంగా కత్తితో గొంతు కోసి హత్య చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి కుడికిల్ల గ్రామానికి చెందిన ఓంకార్ తన భార్య పిల్లలు బైకుపై వస్తూ ఓంకార్ తన భార్యతో గొడవ పడుకుంటూ వస్తూ మార్గమధ్యలో గంట్రావుపల్లి సమీపంలో బైక్ పై నుంచి కిందికి నెట్టి వెళ్ళిపోయాడు.ఎత్తం సమీపంలోని అడ్డగట్టు దగ్గరకు పిల్లలను చందన(3), విశ్వనాథ్(1) తీసుకొచ్చి తనతో పాటు తెచ్చుకున్న కత్తితో గొంతులు కోసి హత్య చేశారని గ్రామస్తులు తెలిపారు. దాంతో గొంతుకోసిన అతడు కూడా కూడా గొంతు కోసుకున్నాడు.అతని పరిస్థితి సీరియస్ గా ఉండడంతో జిల్లా ఆసుపత్రికి తరిలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

