ఆలయ నిర్మాణానికి "కోరాడ నాగభూషణరావు " భారీ విరాళం

ఆలయ  నిర్మాణానికి "కోరాడ  నాగభూషణరావు " భారీ విరాళం

ఆనందపురం:

మండలంలోని గొట్టిపల్లి పంచాయతీ చీమలమెట్టపాలెం గ్రామంలో బంగారమ్మ తల్లి ఆలయం నిర్మాణానికి భీమిలి మాజీ ఏఎంసీ చైర్మన్ కోరాడ నాగభూషణరావు భారీ విరాళం అందించారు. గుడి నిర్మాణానికి తమ వంతు చేయూతనిస్థామని  తన కుమారుడు వేములవలస ఉప సర్పంచ్ కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ ఇచ్చిన హామీ మేరకు గ్రామస్తులకు 50 వేల రూపాయలు విరాళంగా అందించారు. ఈ సందర్భంగా నాగభూషణరావు మాట్లాడుతూ అందరూ ఆధ్యాత్మిక చింతన అలవరచుకోవాలి అన్నారు. ఆధ్యాత్మికత
ద్వారా మనసు ప్రశాంతంగా ఉండటమే కాకుండా తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా విజయవంతం అవుతాయి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, పాలిన వెంకన్న, ఎర్ర బంగారు నాయుడు(బన్నీ), ఎర్ర అప్పలనాయుడు, పాలిన అప్పలరాజు, ఎర్ర రాజు, కేశా నాగేశ్వరరావు, పాలిన రమణ తదితరులు పాల్గొన్నారు.