అమరవీరుల త్యాగఫలాలే దేశానికి స్వాతంత్ర్య సౌభాగ్యం..!భీమిలి టిడిపి ఇంచార్జ్ కోరాడ రాజబాబు

అమరవీరుల త్యాగఫలాలే దేశానికి స్వాతంత్ర్య సౌభాగ్యం..!భీమిలి టిడిపి ఇంచార్జ్ కోరాడ రాజబాబు

భీమిలి:

భావి భారత పౌరుల సౌఖ్యం కోసం నాడు ఎంతోమంది స్వాతంత్ర్య సమరయోధుల ప్రాణత్యాగం కారణంగా మన  దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని  తెలుగుదేశం పార్టీ భీమిలి ఇంచార్జ్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కోరాడ రాజబాబు అన్నారు.

స్వాతంత్య్రం సిద్దించి 75 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్బంగా   తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆదేశానుసారం    ఆజాదికా అమృత్ మహోత్సవ్ సందర్బంగా  హర్ ఘర్ తరంగా కార్యక్రమాన్ని కోరాడ రాజబాబు ప్రారంభించారు. ఈ సందర్బంగా భీమిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మువ్వన్నెల జెండాను ఎగురవేసారు.   స్వాతంత్ర్య పోరాట ఆమవీరులను  స్మరించుకుంటూ ప్రతీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త  జాతీయ జెండాను చేతభూని  కాలినడకన నినాదాలు చేసుకుంటూ  భీమిలి పురవీదుల్లో  తిరిగారు.   ఈ సందర్బంగా కోరాడ రాజబాబు మాట్లాడుతూ  ఆంగ్లేయుల చెరనుండి దేశాన్ని కాపాడటానికి  వందలు, వేల సంఖ్యలో భారతీయులు  వివిధ కోనాల్లో తిరుగుబాటు చేశారని,  దేశ వ్యాప్తంగా  పెల్లుబిగిన ఉద్యమానికి తలొగ్గి   దేశాన్ని విడిచి పారిపోయారని అన్నారు.  1947 ఆగస్టు 15వ తారీకున  భారతదేశానికి స్వాతంత్ర్యo ప్రకటన జరిగిందని అన్నారు.  నేటికీ మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు పూర్తయిన సందర్బంగా  స్వాతంత్ర్య అమరవీరులను స్మరించుకొని  నేటి పౌరులకు వారి త్యాగాన్ని చెప్పవలసిన అవసరం ఉందని కోరాడ రాజబాబు అన్నారు.

ఈ  కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, టెక్కలి నియోజకవర్గం పరిశీలకులు గంటా నూకరాజు, 2,7 కార్పొరేటర్లు గాడు చిన్ని కుమారి లక్ష్మీ, పిల్లా మంగమ్మ, మాజీ జెడ్పిటిసిలు కశిరెడ్డి దామోదరం, శరగడ అప్పారావు,   మాజీ కౌన్సిలర్ చిలకా నర్సింగరావు,  1,2,4 వార్డుల పార్టీ అధ్యక్షులు  తమ్మిన సూరిబాబు, బడికంఠం నీలకంఠం, పాసి నర్సింగరావు,  రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు కురిమిన లీలావతి, నాయకులు పెంటపల్లి యోగీశ్వరావు, మారోజు సంజీవకుమార్, కనకల అప్పలనాయుడు, కాసరపు ఎల్లజీ, వాడమొదలు సత్యారావు, కొక్కిరి అప్పన్న, వియ్యపు పోతురాజు, పిల్లా తాతారావు, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.