భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గెలుపు పై సంబరాలు :-
విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం:
విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలంలో వెల్లంకి గ్రామం లో బిజేపి కిసాన్ మోర్చా ఉత్తరాంధ్ర సోషల్ మీడియా కన్వీనర్ పి.వి.వి. ప్రసాదరావు పట్నాయక్ ఆధ్వర్యంలో బిజేపి నాయకులు కార్యకర్తలు అభిమానులు మధ్య అందరికీ స్వీట్లు పంపిణీ చేస్తూ,బాణసంచా కాల్చి, సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా, పి.వి.వి. ప్రసాదరావు పట్నాయక్ మాట్లాడుతూ, ఆదివాసి చెందిన మహిళా దేశ ప్రథమ పౌరురాలుగా, రాష్ట్రపతిగా, ఎంపీక కావడం, ఆదివాసులు కూడా, భారతదేశం రాష్ట్రపతి కాగలరని ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం యొక్క బహుమతి, ఇది భారతీయ జనతా పార్టీలో సాధ్యమని అన్నారు. ఈ సందర్భంగా బిజేపి సీనియర్ నాయకులు,బుత్తల రాజు, గండి లక్ష్మి రావు,పి. సాయి రమేష్, మాట్లాడుతూ, ఈ ఎన్నికలు ఓట్లు వేసిన, అధికారి పార్టీలకు, ప్రతిపక్ష పార్టీలకు, కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో బిజేపి సీనియర్ నాయకులు బోర శ్రీను,పిల్లా చిన్నారావు,కే.వెంకట రమణ, కొమ్ము శంకర్, మరియు బిజేపి కార్యకర్తలు పాల్గొన్నారు.

