జగనన్న కాలనీకి రియల్ ఎస్టేట్ దందా..!చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం.
జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన ఫలితం శూన్యం:సర్పంచ్ కర్రి పుష్ప.
దేవరాపల్లి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి నూతన గృహం అందించాలన్న దృఢ సంకల్పంతో. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న కాలనీ పథకం ప్రవేశపెట్టి ప్రతి పేదవాడికి ఇల్లు అందించాలి అన్న సంకల్పంతో ఈ పథకాన్ని ప్రవేశపెడితే ఇదేమీ పట్టనట్లుగా కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు అదను చూసుకొని తప్పుడు మార్గాలకు బాటలు వేస్తున్నారని, మండలంలోని నాగయ్యపేట పంచాయతీ సర్పంచ్ కర్రీ పుష్ప అన్నారు. ఈ విషయమై సర్పంచ్ కర్రి పుష్ప గురువారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ, నాగయ్యపేట పంచాయతీ పరిధిలో జగనన్న కాలనీ లేఅవుట్ లో 14 ప్లాట్లు వేసి ఉన్నారని, ఇందులో 11 మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసి ఉన్నారని తెలిపారు. ఇదిలా ఉండగా పరవాడ దాలిమ్మ, తమడపు సింహాచలమ్మ, జగనన్న ఇల్లు మంజూరు కాకపోయినా, వీళ్లకు తహశీల్దార్ పట్టా ఇవ్వడం జరిగిందన్నారు. ఇదే అదునుగా కొంతమంది రియల్ వ్యాపారులు ప్రభుత్వం కేటాయించిన జగనన్న లేఅవుట్ లో ఎటువంటి అనుమతులు లేకుండానే వీరిద్దరి పేరిట నిర్మాణ పనులు చేపడుతున్నారని సర్పంచ్ తెలిపారు. గత ప్రభుత్వం లోని వీరికి ఇల్లు మంజూరు అయ్యాయని, వీరు బిల్లులు కూడా పొంది ఉన్నారని, ఆ నివేదిక స్పష్టంగా హౌసింగ్ డిపార్ట్మెంట్ వారి లాగిన్ లో ఉన్నది అని ఆమె అన్నారు. ఈ జరుగుతున్న అన్యాయం పై ప్రభుత్వ ఆస్తులు అన్యాక్రాంతం కాకూడదన్న ఆలోచనతో జిల్లా కలెక్టర్ కు, తహశీల్దార్ కు ఫిర్యాదు చేసిన చర్యలుమాత్రం శూన్యం అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పై స్థాయి అధికారులు స్పందించి ప్రభుత్వ ఆస్తులు కాపాడాలని ఆమె ఆకాంక్షించారు.

