మాధవధార లో జనసేన పార్టి కార్యలయంలో ఆయన జనసేన నియోజక వర్గ సమన్వయకర్తలు, ముఖ్య నాయకులు, వీర మహిళలతో సమావేశం.
vishaka local newsJune 03, 2022
మాధవధార లో జనసేన పార్టి కార్యలయంలో ఆయన జనసేన నియోజక వర్గ సమన్వయకర్తలు, ముఖ్య నాయకులు, వీర మహిళలతో సమావేశం.
ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా 3వ రోజు జనసేన నాయకులు నాగబాబు విశాఖలో పర్యటించారు. మాధవధారలోని జనసేన పార్టి కార్యలయంలో ఆయన జనసేన నియోజక వర్గ సమన్వయకర్తలు, ముఖ్య నాయకులు, వీర మహిళలతో సమావేశం నిర్వహించారు. పార్టి బలోపేతానికి చేపట్టవలసిన సలహాలు, సూచనలు వారిని అడిగి తెలుసుకున్నారు. ప్రజలంతా ఇదివరకు ఎన్నడూ ఏపార్టీ పైన చూపించని వ్యతిరేకతతో నేటి అధికార పార్టి పైన చూపిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిని చేసుకునే భాధ్యత ప్రతీ ఒక్క జనసేన నాయకులు, కార్యకర్తల పైన ఉందని, 2024 ఎన్నికల్లో జనసేన గెలుపే పరమావిధిగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నాగబాబు పార్టి శ్రేణులకు సూచించారు. అనంతరం పార్టీ చేరికలు చేపట్టారు. జనసేన భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త డా.సందీప్ పంచకర్ల నేతృత్వంలో వైఎస్సార్సీపి నాయకులు పోతిన తిరుమలరావు, ఆయన తనయుడు పోతిన సాయి కుమార్, రెడ్డి సత్యనారాయణ జనసేనలో చేరారు. వారిని జనసేన పార్టి కండువా వేసి నాగబాబు ఆత్మీయంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా పోతిన తిరుమలరావు మాట్లాడుతూ గతంలో ఉన్న పార్టీలో తమకు ఆదరణ లేదని, పార్టి కోసం తాము కష్ట పడటమే తప్ప మమ్మల్ని గుర్తించే అధినాయకుడు భీమిలి నియోజకవర్గంలో లేక పోవడం గమనార్హం అని, ప్రస్తుతం వైఎస్సార్సిపి లో ఉన్న అందరి కార్యకర్తల పరిస్థితి ఇదేనని అన్నారు. యువకుడు అయిన డా.సందీప్ పంచకర్ల సందీప్ నాయకత్వంలో చేపడుతున్న కార్యక్రమాలు చూసేనని, ఆయన అధికార పార్టి చేపడుతున్న తప్పుడు విధానాల పై ధీటుగా ప్రశ్నిస్తున్నారని అన్నారు. పార్టీలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తలతో ఆయన మెలిగే విధానం కూడా నచ్చిందని అన్నారు. జనసేన తరపున ప్రజా సమస్యల పై తమ గళాన్ని ఇక వినిపిస్తామని తిరుమలరావు అన్నారు.