అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం.

 అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం.

తిరుపతి జిల్లా:

యువతే దేశానికి ఆయువు పట్టు యువత బాగుంటేనే సమాజం బాగుంటుంది.

ప్రతి ఒక్కరూ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి. 

పిల్లల నడవడికలను తల్లి తండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ వారిని సరైన మార్గంలో పయనించే విదంగా చూడాలి.

జిల్లా ఎస్పీ.పి. పరమేశ్వర రెడ్డి ఐ.పి.యస్,.

 అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని, 
మత్తు పదార్థాల తయారీ రవాణా అమ్మకాల నిర్మూలనకు సమాజంలో ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేయాలని తిరుపతి జిల్లా ఎస్పీ.పి పరమేశ్వర రెడ్డి ఐ.పి. యస్,. పిలుపునిచ్చారు.

అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా  స్పెషల్  ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో మరియు పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీ లో ఎస్పి పాల్గొన్నారు.

అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆదివారం తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్ లోని  అన్నమయ్య కూడలి నుండి  ఎంఆర్ పల్లి కూడలి వరకు పోలీసులు మరియు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో   ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ జరిగింది. 

అనంతరం ఎంఆర్ పల్లి కూడలిలో మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ .పి. పరమేశ్వర రెడ్డి ఐ.పి.యస్ ,అడ్మిన్ అడిషినల్/ స్పెషల్  ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ ఎస్పీ సుప్రజా, ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ఎస్పీ స్వాతి,హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. 

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ  మాట్లాడుతూ సమాజంలోని స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు విద్యార్థులు విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు మత్తుపదార్థాలను వ్యతిరేకించాలని అన్నారు. ప్రధానంగా చదువుకునే విద్యార్థులు మాదకద్రవ్యాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆడపిల్లలు తమ నడవడికలలో క్రమశిక్షణ కలిగి ఉండాలని అన్నారు. సమాజంలో లోఒక్కరు సమిష్టిగా మాదకద్రవ్యాలను వ్యతిరేకించి నాడే సమాజ అభివృద్ధి జరుగుతుందని ఆయన ఆకాంక్షించారు..

ఈ కార్యక్రమంలో  పోలీసులు, ఎస్ఈబి,అదికారులు విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.