గోపాలపట్నం కొత్తపాలెం ప్రాంతంలో శుక్రవారం నాడు ఒకే రోజు ఇద్దరు యువకులు ఆత్మహత్య.

 గోపాలపట్నం కొత్తపాలెం ప్రాంతంలో శుక్రవారం నాడు ఒకే రోజు ఇద్దరు యువకులు ఆత్మహత్య.

గోపాలపట్నం:

గోపాలపట్నం జూన్ 25 89వార్డు కొత్తపాలెం ప్రాంతంలో శుక్రవారం నాడు ఒకే రోజు ఇద్దరు యువకులు ఆత్మహత్య చేసుకొన్నారు. 
నాగేంద్ర కాలానికి చెందిన రాజు (30) భార్య ఇద్దరు పిల్లలతో కలసి జీవిస్తున్నాడు. స్థానికుల సమాచారం మేరకు గత కొంత కాలం నుండి మద్యానికి బానిసై భార్యను హింసిస్తున్నట్టు తెలిపారు. గతంలో రెండు సార్లు ఆత్మహత్యయత్నమునకు పాల్పడ్డాడని, ఓసారి చావు వరకు వెళ్లి బతికి బయటపడినట్టు సమాచారం. చివరకు ఈ రోజు ఉదయం ఇంటి ఫ్యాన్ కూ ఉరి వేసుకొని మృతి చెందాడు. కుటుంబ పెద్దదిక్కు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీర్రు మున్నీరై రోదిస్తున్నారు.

కొత్తపాలెం రామాలయం వీధిలో వివాహితుడైన కాళ్ళ సురేష్ (31) కుటుంబ కలహాలతో శుక్రవారం ఉదయం 8గంటల ప్రాంతంలో ఇంటిలో ఎవరు లేని సమయంలో, తన మణికట్టునూ కోసుకొని చావాలని నిశ్చయించుకున్నాడు. రక్తం కారుతున్న ఇంకా చావలేదని! ఇంటిలో ఫ్యాన్ కూ ఉరి వేసుకొని మృతిచెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదుల మేరకు ఇరు మృతదేహాలకూ గోపాలపట్నం పోలీస్ లూ కేసు నమోదు చేసి,కేజిహెచ్ మార్చురీకి తరలించారు.