వైసిపి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రముఖ దేవాలయాల ఆస్తులు, ఆదాయం పై శ్వేతపత్రం విడుదల చేయాలి :శివసేన
విశాఖ లోకల్ న్యూస్ :విశాఖపట్నం ప్రతినిధి
శివసేన రాష్ట్రకార్యలయంలో రాష్ట్రపదాదికారుల సమావేశం నిన్న అమరావతి లో జరిగింది రాష్ట్రంలో ఉన్న దేవాలయములలో జరుగుతున్న అన్యాయాల పై శివసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వినోదుల. నరసింహారావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు .రాష్ట్రంలో దేవదాయ ధర్మదాయ శాఖ తీరు రోజురోజుకి దిగజారిపోతుందని మంత్రి మారితే బాగుంటుంది అనుకున్నాము. పవిత్ర సింహాచలం దేవస్థానం లో పవిత్ర చందనోత్సవం రోజున మూలవిరాట్టు విడియో తీసి సోషల్ మీడియాలో పోష్టు చేయించడం, దేవాలయ ప్రాంగణంలో ఎక్కడా కూడా మైకులలో నమో నారాయణ అని గాని గోవింద నామాలు పలుకకుండా ఉండటం అలాగే హుండీ ఆదాయం లెక్కించే సమయంలో సింహాచలం లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ట్రస్టు బోర్డు సభ్యుడు భగవంతునికి ఉపయోగించే మల్లె పూలు దండలు, సంపంగి పూలు దండలు,వేసుకుని హుండీ ఆదాయం పైన కూర్చుని ఫోటో తీసుకుని సోషల్ మీడియాలో పోష్టులు పెట్టుకోవడం చాలా నీచమైన చర్యలు వీటిని శివసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాష్ట్రంలో ప్రధాన దేవాలయములో అవినీతి ఆరోపణలు, భక్తులకు దేవాలయములో సౌకర్యాలు సమకుర్చలేక భక్తులను ఇబ్బందుల పాలు చేయడం అలాగే దేవాలయములో ఆభరణములు, విలువైన దేవుని సామాన్లు చోరికి గురికావడం దేవాదాయశాఖ అసమర్థత కనిపిస్తుంది. కాబట్టి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాల ఆస్తులు, ఆదాయం పై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసారు. హిందూ దేవాలయములో వచ్చే ఆదాయాన్ని ఆయా దేవాలయాల అభివృద్ధికి భక్తులకు మంచి సౌకర్యాలు అందించడానికి ఖర్చు పెడితే బాగుంటుందని అన్నారు.లేని పక్షమలో శివసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో శివసేన పార్టీ రాష్ట్ర పదాదికారులు , కార్యకర్తలు పాల్గొన్నారు.

