ఊహించని విషాద ఘటన :జీలకర్ర బెల్లం పెట్టే ప్రక్రియ పూర్తయ్యి తాళి కట్టే సమయంలో కుప్పకూలిపోయి ఆసుపత్రి లో చికిత్స పొందుతూ మృతి.

 ఊహించని విషాద ఘటన :జీలకర్ర బెల్లం పెట్టే ప్రక్రియ పూర్తయ్యి తాళి కట్టే సమయంలో కుప్పకూలిపోయి ఆసుపత్రి లో చికిత్స పొందుతూ మృతి.

ఊహించని ఈ విషాద ఘటన విశాఖ జిల్లా మధురవాడలో చోటుచేసుకుంది

విశాఖ లోకల్ న్యూస్ :విశాఖపట్నం ప్రతినిధి

బంధువుల సందడి.. మేళతాళాలు.. విందువినోదాలు.. మరికాసేపట్లో తాళికట్టే ప్రక్రియ.. అంతలోనే వధువు కుప్పకూలింది.. ఏమైందో అని చూసే సరికి ప్రాణం విడిచింది. ఊహించని ఈ విషాద ఘటన విశాఖ జిల్లా మధురవాడలో చోటుచేసుకుంది.

విశాఖపట్నం: విశాఖ నగర శివారులోని మధురవాడ నగరం పాలెంలో నిన్న రాత్రి నాగోతి శివాజీ, సృజనల వివాహానికి ఏర్పాట్లు జరిగాయి. పండితులు వేద మంత్రాల మధ్య జీలకర్ర బెల్లం పెట్టే ప్రక్రియ మొదలయింది. ఇంతలోనే ఊహించని విధంగా సృజన పెళ్లి పీటలపై కుప్పకూలింది. కుటుంబ సభ్యులు కంగారుపడి ఆమెకు సపర్యలు చేశారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు నిర్ధారించారు. ఊహించని ఈ ఘటనతో ఒక్కసారిగా పెళ్లి వేడుకల్లో విషాదం నెలకొంది. వివాహ నేపథ్యంలో గత రెండు రోజులుగా పెళ్లి కూతురు అలసటకు గురై నీరసించిందని బంధువులు తెలిపారు. కానీ ఇలా ప్రాణాలు కోల్పోతుందని భావించ లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ విషాదం తో ఇరుకుటుంభ సభ్యులు విషాదంలో ఉన్నారని స్థానికులు అంటున్నారు.