ఎంపి విజయసాయి రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన జి వి ఆర్ సంస్థల అధినేత గరే వెంకటరమణ.
విశాఖ లోకల్ న్యూస్: విశాఖపట్నం ప్రతినిధి 19-05-2022
మధురవాడ .మే 19: రాజ్యసభ సభ్యుడుగా రెండవసారి ఎంపికైన విజయసాయి రెడ్డిని నగరాల యువ నాయకుడు గరే వెంకటరమణ కలసి శుభాకాంక్షలు తెలియజేశారు. తాడేపల్లి లోని ఎంపి విజయసాయి రెడ్డి కార్యాలయంలో బక్కన్నపాలెంకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, నగరాల యువ నేత గరే వెంకటరమణ కలిసి పుష్ప గుచ్ఛం ఇచ్చి వరుసగా రెండవసారి రాజ్య సభకు ఎంపికైన సందర్బంగా విజయసాయి రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.

