శ్రీ శ్రీ శ్రీ విజయ దుర్గ మల్లికార్జున స్వామి దేవాలయం 12వ పుష్కర వార్షికోత్సవం.

 మధురవాడ జోన్ టు పరిధిలోని అయోధ్య నగర్ లో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ది గ్లోబ్ స్కూల్ యాజమాన్యం  బోను వెంకట్రావు అనురాధ దంపతులు ఆధ్వర్యంలో శ్రీ శ్రీ శ్రీ విజయ దుర్గ మల్లికార్జున స్వామి దేవాలయం 12వ పుష్కర వార్షికోత్సవం చాలా ఘనంగా నిర్వహించారు. 12వ వార్షికోత్సవం సందర్భంగా వేద మంత్రాలతో వేద పండితులతో 17 -05-2022 మంగళవారం నుండి 19-05-2022 3 రోజులు ప్రధాన అర్చకులు రంప వామన శర్మ పర్యవేక్షణలో శ్రీ జడ సూర్యనారాయణ శాస్త్రి వేద పండితులచే వేద మంత్రాలతో ది గ్లోబు స్కూల్ యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులకు కు ఆయు ఆరోగ్య సిరి సంపద విద్యా బోధన కలిగి ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం జరిగే పూజ కార్యక్రమంలో   ముఖ్య అతిధిగా శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ నరేంద్ర సరస్వతి స్వామి ముఖ్యఅతిథిగా పాల్గొని పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా పూజా కార్యక్రమాల అనంతరం సుమారు 700 మంది కి అన్నదానం కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలోఎగ్జిక్యూటివ్  డైరెక్టర్ వసంత కుమార్,ప్రిన్సిపాల్ లలిత,ఏవో రామకృష్ణ, స్కూల్ సిబ్బంది తదితరులు మరియు తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు.