దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సారాలు కావస్తున్నా ప్రజలకు రక్షిత మంచి నీరు అందుబాటులో లేకపోవడం నిజంగా దురదృష్టం.
విశాఖ లోకల్ న్యూస్ :
ప్రజల ప్రాథమిక అవసరమైన మంచి నీటి కోసం కిలోమీటర్ల దూరం వెళ్లి తెచ్చుకోవాల్సిన దుస్థితి ఇప్పటికీ మనం చూస్తున్నాం. ఇలాంటి దయనీయ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉండడం చాలా బాధాకరం అని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాకినీడి మణికంఠ స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆయన విశాఖపట్నంలో మాట్లాడుతూ ప్రభుత్వాలకు నీటి నిర్వహణ అనేది అత్యంత ముఖ్యమైన కార్యక్రమంగా పెట్టుకోవాలి. దురదృష్టవశాత్తు మన రాష్ట్ర ప్రభుత్వం అటు వైపుగా ఆలోచన చేయలేదు అని చెప్పక తప్పదు. వర్షాకాలంలో లభించే నీటిని వ్యవసాయ ఆధారిత ప్రాంతం కాబట్టి వ్యవసాయానికి, రాయలసీమ, ఉత్తరాంధ్ర లోని కొన్ని ప్రాంతాలలో వేసవి కాలం తీవ్ర నీటి ఏద్దడి ఉంటుంది కాబట్టి తాగు నీటి అవసరాలకు నిల్వ ఉంచి అవసరమైన సమయాల్లో నీటిని అందించాలి. కానీ ప్రభుత్వం ఈ విషయంలో విఫలం అయినట్లు కనిపిస్తుంది. కర్నూల్ కొసగి మండలం లో, కౌతాళం మండలం లోని గ్రామాల ప్రజల ఇక్కట్లు చూస్తుంటే హృదయం ద్రవించక మానదు. ఒక చిన్న టాంక్ లో ఉదయం 11 గం నుండి మధ్యాహ్నం 3 గం వరకు నీటి సరఫరా ఉంటుంది. తోపుడు బళ్ళు వేసుకొని బిందెలతో కిలోమీటర్ల దూరం వారు పడుతున్న బాధ వర్ణనాతీతం. ఇక మధ్యలో కరెంట్ పోతే ఎండలో వారు నరకం చూస్తున్నారు. సిక్కోలు ప్రాంతం లో,పార్వతి పురం మన్యం ప్రాంతాలలోని తండాలలో కూడా ఇలాంటి నీటి యెద్ధడి పరిస్థితులు ఉన్నాయి.ప్రభుత్వం దయచేసి ఈ సమస్య మీద సీరియస్ రివ్యూ చేసి అయా ప్రాంతాల ప్రజలకు నీటి కష్టాలు తీర్చండి, ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలి అని విజ్ఞప్తి చేస్తున్నాను.

