బహిరంగ వ్యాయామశాలను ప్రారంభించిన జనసేన కార్పోరేటర్ పీతల మూర్తి యాదవ్.

 22 వ వార్డులో బహిరంగ వ్యాయామశాలను ప్రారంభించిన జనసేన కార్పోరేటర్ పీతల మూర్తి యాదవ్.

విశాఖ లోకల్ న్యూస్ :విశాఖపట్నం 


గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో గల 22 వ వార్డు పిఠాపురంకాలనీ మార్కెట్ దగ్గర ఓపెన్ స్పేస్లో బహిరంగ వ్యాయామశాల ను వార్డు కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ ఆదివారం ప్రారంభించారు.  

నగర పాలక సంస్థ కేటాయించిన అభివృద్ధి నిధులతో బహిరంగ ప్రదేశంలో బహిరంగ వ్యాయామశాల ఏర్పాటు చేయడమయినదని 22వ వార్డులో గల యువత మరియు విద్యార్థులు ఈ వ్యాయామశాలను ఉపయోగించుకొని శరీరదారుఢ్యాన్ని సాధించాలని ఆయన పిలుపునిచ్చారు .

ఈ కార్యక్రమంలో వార్డు లో గల పీతలవానిపాలెం శ్రీకృష్ణ యువజన సంఘం కమిటీ మెంబర్స్, ఉడాకాలనీ అసోసియేషన్ సభ్యులు , శ్రీకృష్ణ సేవాసంఘం శివాజీపాలెం అసోసియేషన్ సభ్యులు , నేతాజీ నగర్, మంగాపురం కాలని, తారా మసీదు , బలరాంనగర్ సిద్ధార్థనగర్ రేసపువానిపాలెం తదితర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున యువత పాల్గొన్నారు.