జాతీయ ఉత్తమ సేవ పురస్కారనికి ఎంపికైన స్కౌట్ మాస్టర్ డాక్టర్ మారుతి హరీష్ కుమార్.
విశాఖ లోకల్ న్యూస్ :విశాఖపట్నం
చినుకు కల్చరల్ సొసైటీ మరియు అర్ అర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్ టి ఆర్ జయంతి ఉత్సవాలలో భాగంగా అనేక రంగాలలో సేవలు అందిస్తున్న వారిని గుర్తంచి ఎన్ టి ఆర్ జాతీయ సేవ పురస్కారాలు అందజేస్తున్నారు. విశాఖపట్నం జిల్లా కి చెందిన స్కౌట్ మాస్టర్ మరియు చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ నగర కార్యదర్శి డాక్టర్ మారుతి హరీష్ కుమార్ ను జాతీయ ఉత్తమ సేవ పురస్కారానికి ఎంపిక చేశారు. ఈ సంస్థ నిర్వాహకులు డాక్టర్ కొలుకురి రావు , కే. బుచేస్వరారావు ప్రకటించారు. ఈ నెల 29 ఎన్ టి ఆర్ జయంతి నీ పురస్కరించుకొని డాక్టర్ మారుతి హరీష్ కుమార్ కు హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అవార్డు ను అందజేయనున్నారు.

