దుర్గా సేవా సంఘం ఆద్వర్యంలో సీతారాముల కళ్యాణ మహోత్సవo.
విశాఖపట్నం ప్రతినిధి:
శ్రీ రామ నవమి సంధర్బంగా 13వ వార్డు ధుర్గాబజార్, సెక్టర్ 4 లో గల శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఎర్ని దుర్గా సేవా సంఘం ఆద్వర్యంలో ముఖ్య అతిధిలుగా నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి శ్రీనివాస్ దంపతులు, తూర్పు నియోజకవర్గం సమన్వయ కర్త అక్కరమాని విజయనిర్మల దంపతులు, 13వ వార్డు కార్పొరేటర్ సునీత సత్యనారాయణ దంపతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వెర్నిదుర్గా సేవాసంఘం సభ్యులు, మహిళా కమిటి సభ్యులు, మహిళలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి సన్నాయి మెళతాళాలతో మహిళా కమిటీ సభ్యులు ఎం. రోజారమణి, బండి. జ్యోతి, లీలారాణి, సత్యవతి తదితరులు పాల్గొని స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరగడానికి సహాయ సహకారాలు అందించారు.

