శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన కోరాడ శ్రీనివాసరావు.
విశాఖ లోకల్ న్యూస్:
శ్రీహరిపురం విశాఖ జిల్లా లో నివాసం ఉంటున్న కళింగ వైశ్య కుటుంబ సభ్యులకు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మరియు ప్రజలకు అభిమానులకు కోరాడ శ్రీనివాసరావు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు .
మీడియాతో మాట్లాడుతూ రామ నవమి విశిష్టత ఏంటి? రామ రాజ్యం ఎలా ఉండేది? హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్ర శుద్ధ నవమినాడు శ్రీరాముడి వివాహం జరిగిందని, ఆ రోజే ఆయన పట్టాభిషేకం జరిగిందని ప్రతీతి. అందుకే శ్రీరామ నవమిని దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగాజరుపుకుంటారు. రామాణయం గురించి ప్రతి ఒక్కరికి తెలిసినా ఆ మహాగాధను ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలని అనిపిస్తుంటుంది.
ఒకే మాట, ఒకే బాట, ఒకే భార్య.. మాట తప్పని వైనం, మడమ తిప్పని శౌర్యం.. ప్రతి మనిషిలోనూ ఉండాల్సిన లక్షణాలు. వీటన్నింటీ ప్రతిరూపమే పరమపావన మూర్తి శీరామచంద్రమూర్తి. దేవుడిగా కాకుండా ఓ మనిషిగా ఆయనను చూస్తే అందరికీ ఆదర్శప్రాయంగా ఉంటాడు. అంతటి మహాపురుషుడు ఈ భూమిపై తిరిగాడంటే ఆశ్చర్యమేస్తుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్ర శుద్ధ నవమినాడు శ్రీరాముడి వివాహం జరిగిందని, ఆ రోజే ఆయన పట్టాభిషేకం జరిగిందని ప్రతీతి. అందుకే శ్రీరామ నవమిని దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా జరుపుకుంటారు. రామాణయం గురించి ప్రతి ఒక్కరికి తెలిసినా. ఆ మహాగాధను ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలని అనిపిస్తుంటుంది. కోరాడ శ్రీనివాసరావు తెలియజేశారు

