తహసీల్దార్లకు మీసేవ నిర్వాహకులను ఆదుకోవాలని వినతిపత్రాలు అందచేసిన మీసేవ నిర్వాహకులు.

 తహసీల్దార్లకు  మీసేవ నిర్వాహకులను ఆదుకోవాలని వినతిపత్రాలు అందచేసిన మీసేవ నిర్వాహకులు.

విశాఖ లోకల్:



డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి l 2003 లో ఎంతో ప్రతిష్టాత్మకంగా స్థాపించినటువంటి డేటా సెంటర్ 
ఆ తర్వాత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మీసేవ గా రూపుదిద్దుకుంది ప్రజలకు ఎన్నో సేవలందిస్తున్న వంటి మీ సేవ నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సచివాలయ సంస్థని స్థాపించి మీ సేవలు కి మరింత అభివృద్ధి చెందేలా చేస్తున్నారనే ఆనందం వ్యక్తం చేశారు కానీ నేడు ఒక్కొక సర్వీసులు మీ సేవలో తొలగించడంతో నిర్వాహకులు అందరు కూడా ఉపాధి కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేసారు. గతంలో కేసు నెంబర్ 21418/2019 జీవో 22 మీసేవ సర్వీసులు సచివాలయంలో నడప రాదని కోర్టు స్టే ఇచ్చినప్పటికీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్లకూడదనే దీంతో ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి మీసేవ నిర్వాహకులకి న్యాయం చేస్తారని ప్రజలకి సేవ చేస్తూ వస్తున్నాము. కాని ప్రభుత్వం నుండి మీసేవ నిర్వాహకులకి  ఎటువంటి స్పందన రాకపోవడం ప్రభుత్వానికి ఆదాయం తీసుకు వచ్చే సర్వీసులను తొలగించటం వల్ల నిర్వాహకులు ఆదాయం కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేసారు. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా మీసేవ నిర్వాహకులు యూనియన్ ఈ ఎస్ డి డిపార్ట్మెంట్ ని కలవడం జరిగింది. అలాగే ప్రతి నియోజకవర్గంలో రాష్ట్ర మీసేవ నిర్వాహకుల సంక్షేమ సంఘం (రి. నం 74/2012) ఆదేశాల తో విశాఖపట్నం మండల ఆఫీసులో తాసిల్దార్ కి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అదే తరుణంలో మంగళవారం గాజువాక, విశాఖ రూరల్ నిర్వాహకులు అందరూ కూడా గాజువాక, విశాఖ రూరల్ తాసిల్దార్ లకి రిప్రజెంటేషన్ ఇచ్చారు. తహసీల్దార్ లు సానుకూలంగా స్పందించి పై అధికార్లకు తెలియ చేస్తామని హామీ ఇచ్చారు.