స్టీల్ ప్లాంట్ ప్రభుత్వరంగ రక్షణకై మార్చి 28న విశాఖబంద్- టీడీపీ పార్టీ మద్ధతు- పీలా శ్రీనివాసరావు.

 స్టీల్ ప్లాంట్ ప్రభుత్వరంగ రక్షణకై మార్చి 28న విశాఖబంద్- టీడీపీ పార్టీ మద్ధతు- పీలా శ్రీనివాసరావు.

విశాఖపట్నం:





స్టీల్ ప్లాంట్  ప్రభుత్వరంగ రక్షణకై విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజాసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో విశాఖ జిల్లా రాజకీయ పార్టీలు, కార్మిక,ప్రజా సంఘాల నేతలతో నగరంలో గల పౌర గ్రంథాలయంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో  టీడీపీ తరపున పాల్గొన్న జీవిఎంసి ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు, నజీర్..

పీలా శ్రీనివాసరావు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కు  వ్యతిరేకంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో మార్చి 28న నిర్వహించే విశాఖ బంద్ కు టీడీపీ పార్టీ సహకారం పూర్తిగా ఉంటుంది అని తెలిపారు.విశాఖ ఉక్కు-ఆంధ్రులహక్కు  అని గుర్తు చేశారు.గతంలో కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ప్రయత్నాలు జరిగితే ఆరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఆపారని తెలియడం జరిగింది. కానీ ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం కి చిత్తశుద్ధి లేదని, జీవిఎంసీ ఎన్నికల కొరకు మాత్రమే స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని ఉపయోగించుకున్నారని తెలిపారు. ఇప్పటికైనా వైఎస్సార్ ప్రభుత్వం ఈ బంద్ కు  సంపూర్ణ మద్దతు ఇచ్చి  కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాలని కోరారు . ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు, వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.