నీటి వనరులను కాపాడి, భావితరాలకు అందించండి.

 నీటి వనరులను కాపాడి, భావితరాలకు అందించండి.

నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి

విశాఖపట్నం:


నీటి వనరులను కాపాడి భావితరాలకు అందించాలని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి తెలిపారు. మంగళవారం ఆమె జివిఎంసి ప్రధాన కార్యాలయంలోని పాత సమావేశ మందిరంలో “ప్రపంచ జల దినోత్సవం” సందర్భంగా ఎస్.ఆర్.యు. ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించగా, జివిఎంసి కమిషనర్ డాక్టర్ జి. లక్ష్మీశ ముగుంపోత్సవం చేశారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ 'పర్యావరణ ప్రగతి' 1992లో ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిందని, దీని ముఖ్య ఉద్దేశం కనిపించని భూ జలాలను కనిపించేలా చేయడమే ముఖ్య ఉద్దేశమని తెలిపారు. నీరు ప్రకృతి ప్రసాదించిన గొప్ప వరం అని, నీటి వనరులు అంతరించిపోకుండా కాపాడవలసిన బాధ్యత మన అందరిపైనా ఉందని తెలిపారు. అనవసర నీటి వినియోగాన్ని తగ్గించాలని, ప్రతి మూడు లీటర్లు నీరు బయటికి తీస్తే ఒక్క లీటర్ మాత్రమే భూమిలోకి ఇంకుతుందని, అడవులు పెంచాలని తద్వారా నీటి ఆవిరిని తగ్గించాలని, భూమి లోపల నీటి శాతాన్ని పెంచాలని తెలిపారు. మనం ఇంట్లో వాడే నీటిని సద్వినియోగం చేసుకొని అవసరం మేరకే ఉపయోగించాలని కోరారు.