పెంచిన విద్యుత్ ఛార్జీలు రద్దు చెయ్యకపోతే మరోసారి విద్యుత్ ఉద్యమం

 పెంచిన విద్యుత్ ఛార్జీలు రద్దు చెయ్యకపోతే మరోసారి విద్యుత్ ఉద్యమం.

*సిపిఐ నగర కార్యదర్శి ఎం. పైడిరాజు*

*ఆరిలోవ అంబేత్కర్ విగ్రహం వద్ద నిరసన*

ఆరిలోవ శుక్రవారం ఏప్రిల్ 01 వ తేదీ
పెంచిన విద్యుత్ ఛార్జీలను ఉపసంహరించుకోకపోతే మరో విద్యుత్ ఉద్యమం తప్పదని సిపిఐ నగర కార్యదర్శి ఎం.పైడిరాజు హెచ్చరించారు. విద్యుత్ చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ శుక్రవారం సీపీఐ ఆధ్వర్యంలో ఆరిలోవ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని  నిర్వహించారూ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఉగాది కానుకగా విద్యుత్ ఛార్జీలు రూ.1400 కోట్లు, ట్రూ అప్ ఛార్జీల పేరుతో మరో రూ. 2900 కోట్లు విద్యుత్ చార్జీలు పెంచారని అన్నారు. విశాఖ నగర ప్రజలకు అదనంగా నెలకు రూ.18 కోట్ల భారం పడుతుందని అన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తక్షణమే రద్దు చెయ్యాలని డిమాండ్ చేశారు. జనవరిలో విశాఖలో 3 రోజులపాటు నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా న్యాయమూర్తి నాగార్జునరెడ్డి గారు విద్యుత్ ఛార్జీల మోత సామాన్య ప్రజలపై ఉండదని చెప్పారని గుర్తు చేశారు. నిన్న ఆయన తన ప్రకటనలో ఈ పెంపు ప్రజలకు పెద్ద భారం కాదని చెప్పడం అన్యాయమని అన్నారు. ఆయన న్యాయమూర్తి కాబట్టి అన్ని సదుపాయాలు ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు. చార్జీలు మోసే సామాన్య ప్రజలకు ఇది భారమని అన్నారు.
నగర సహాయ కార్యదర్శి ఆరిలోవ బాద్యుడు ఎస్ కె రెహమాన్ మాట్లాడుతూ కరోనా మహమ్మారి వల్ల ప్రజలు జీవన స్థితిగతులు దిగజారిపోయాయని, వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 13 స్లాబులుగా ఉన్న వాటిని కేవలం 6 స్లాబులుగా మార్చి బారాలు మోపారని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రోజురోజుకీ పెట్రోల్ డీజిల్, వంటగ్యాస్ ధరలు పెంచతున్నదని ఇది చాలదన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉగాది శుభాకాంక్షలతో విద్యుత్ చార్జీల భారం వేసిందని కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న వైసీపీ పోటీపడి బారాలు వేస్తున్నాయని తక్షణమే పెంచిన విద్యుత్ చార్జీలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో సీపీఐ నాయకులు కె లక్ష్మణరావు, సీహెచ్ కాసుబాబు, ఎ రవి,బి చిరంజీవి, ఎ శశిదేవి,ఎస్ కె మస్థాన్బీ జి. లక్ష్మీ, అరుణ తదితరులు పాల్గొన్నారు.