*భారీగా పెరిగిన ఉపమాక వెంకన్న ఆదాయం.*
విశాఖ లోకల్ :అనకాపల్లి ప్రతినిధి
విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం ఉపమాక గ్రామంలో గరుడాద్రి పర్వతంపై వేంచేసి ఉన్న శ్రీ కల్కి వేంకటేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణోత్సవములలో హుండీ ఆదాయం భారీగా పెరిగిందని టిటిడి విజయవాడ జోన్ సూపరింటెండెంట్ మునిమోహన్ సోమవారం విలేఖరులకు తెలియ చేశారు.
ఈనెల 13వ తేదీ నుంచి ఈరోజు వరకు జరిగిన స్వామి వారి వార్షిక కళ్యాణోత్సవాలను పురస్కరించుకుని 16వ తేదిన పరకామణి (హుండీ లెక్కింపు)కార్యక్రమం నిర్వహించగా ఒకలక్షా పదిహేనువేల రూపాయలు నాణేలు , పద్దెనిమిది లక్షల తొంబైతొమ్మిది వేల రెండు వందల నోట్లు కలసి మొత్తం ఇరవై లక్షల పద్నాలుగు వేల రెండు వందల రూపాయలు కేవలం హుండీ ద్వారా లభించిందని చెప్పారు. ఇది కేవలం ఆరురోజులకు సంబంధించిన హుండీ ఆదాయమని ఆయన తెలిపారు.
గతసంవత్సరం ఇదే ఉత్సవాలకు సంబంధించి ఎనిమిది రోజులకు గాను పదహారు లక్షల ఏడువేల మూడు వందల రూపాయలు వచ్చిందని.
గత సంవత్సరం తో పోలిస్తే ఈ సంవత్సరం నాలుగు లక్షల ఆరువేల తొమ్మిది వందల రూపాయలు కేవలం హుండీల ద్వారానే ఆదాయం పెరిగిందని చెప్పారు.
గతసంవత్సరం కరోనా నింబంధనలు కారణంగా స్వామి వారి సేవలు ఏకాంతంగా నిర్వహించడం జరిగిందని ఈ సంవత్సరం ఉత్సవాలు అన్నీ లోకాంతంగా నిర్వహించడం జరిగిందని ఆయన చెప్పారు.
అలాగే గత సంవత్సరం, ఈసంవత్సరం కూడా స్వామి వారి లడ్డూ ప్రసాదాలను విక్రయించలేదని చెప్పారు.
అయితే ఇప్పుడు కొనసాగుతున్న ఉత్సవాలకు సంబంధించిన హుండీ ఆదాయం మరియు కేశఖంఢన టిక్కెట్లుకు సంబంధించిన ఆదాయం ఉత్సవాలు ముగిసిన తరువాత లెక్కించడం ఏప్రియల్ ఏడవ తేదీన లెక్కించడం జరుగుతుందని చెప్పారు.
ఈసంవత్సరం భక్తులు అధికసంఖ్యలో స్వామి వారిని దర్శించుకోవడం జరిగిందని అయినప్పటికీ ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడం జరిగిందన్నారు.
స్వామి వారి ఉత్సవాలలో సహకరించిన పోలీసు , హెల్త్, ఎలక్ట్రికల్ , ఉపమాక గ్రామ పంచాయతీ, వాటర్ వర్క్స్ , ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా , శ్రీవారి సేవకులు, స్థానిక హెటేరో సంస్థ, వివిద రకాల సేవలందించిన సత్యసాయి, శ్రీవారి సేవకులు,గ్రామ ప్రజలకు , వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులకు ఉత్సవాలు ఘనంగా జరగడానికి సహకరించిన అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియ చేసుకుంటున్నామని ఆయన చెప్పారు. ఈకార్యక్రమంలో దేవస్థానం ప్రధాన అర్చకుడు గొట్టుముక్కల వరప్రసాద్ ఆచార్యులు, దేవస్థానం ఇనస్పెక్టర్ పృథ్వి పాల్గొన్నారు.
