కల్తీ సారా మృతులకు న్యాయం చేయాలి :టీడీపీ అధికార ప్రతినిధి ఇల్లిపిల్లి అప్పలరాజు డిమాండ్ .
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం:మధురవాడ ప్రతినిధి
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఆధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి తెచ్చిన మద్యం జె బ్రాండ్‌ల వలన ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని టీడీపీ విశాఖ అధికార ప్రతినిధి ఇల్లిపిల్లి అప్పలరాజు ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కల్తీ సారా మృతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూన్నారు . ఈ సందర్భంగా అప్పరాజు మాట్లాడుతూ కల్తీసారా మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు. మృతులకు రూ. 25 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైపీపీ ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడే రోజులు దగ్గరపడ్డాయన్నారు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయం అని అప్పలరాజు తెలిపారు.
