వంటింట్లో గ్యాస్ మంట- భారీగా పెరిగిన ధర.
విశాఖ లోకల్:
వంట గ్యాస్ సిలిండర్ ధరను పెంచుతూ.. చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఇంటి అవసరాలకు ఉపయోగించే 14 కేజీల సిలిండర్‌పై 50 రూపాయలు పెంచాయి. పెరిగిన ధరలు మంగళవారం నుంచే అమల్లోకి వస్తాయని చమురు సంస్థలు వెల్లడించాయి.
