తిరుపతి పార్లమెంట్ పరిధి వెంకటగిరిలో ప్రేమోన్మాది ఘాతుకం.
తిరుపతి
తిరుపతి పార్లమెంట్ పరిధి వెంకటగిరిలో ప్రేమోన్మాది ఘాతుకం - ఇంటర్ విద్యార్థిని గొంతుకోసిన చెంచుకృష్ణ - విద్యార్థిని జ్యోతి పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు - తనను ప్రేమించడంలేదని ఘాతుకానికి పాల్పడ్డ చెంచుకృష్ణ - చెంచుకృష్ణను అదుపులోకి తీసుకున్న పోలీసులు.
తిరుపతి రూయ హాస్పిటల్ లో జ్యోతి కి చికిత్స అందిస్తున్నారు.
విషయం తెలుసుకున్న తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహాయాదవ్, తిరుపతి మాజీ శాసనసభ్యులు సుగుణమ్మ, తిరుపతి పార్లమెంట్ తెలుగుమహిళా అధ్యక్షురాలు చక్రాల ఉష విషయం తెలుసుకొని హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకొని జ్యోతి ని పరామర్శించి డాక్టర్ లతో మాట్లాడి మంచి మెరుగైన వైద్యం అందించాలని కోరారు.
