జనసేన పార్టీ సీనియర్ నాయకులు,జనసైనికులు అందరికీ మార్గదర్శకుడు వేలం నూకరాజు మాష్టారు 50వ జయంతి.
అనకాపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సీనియర్ నాయకులు,జనసైనికులు అందరికీ మార్గదర్శకుడు వేలం నూకరాజు మాష్టారు 50వ జయంతి సందర్భంగా అనకాపల్లి జనసేన పార్టీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో మాష్టారు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన పార్టీ కి చేసిన విశిష్ట సేవలను జనసైనికులు గుర్తు చేసుకున్నారు. అనంతరం పట్టణ టౌన్ గర్ల్స్ హై స్కూల్ లో పదవ తరగతి విద్యార్థినులు అందరికి రానున్న ssc పరీక్షలకు ఎగ్జామ్ కిట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తాకాశి సత్యందొర,మంగా ఈశ్వర్,విల్లూరి హరికృష్ణ,భరణికాన రాము,కొడుకుల శ్రీకాంత్,బుద్ధ రాందాస్,అప్పికొండ గణేష్,మద్దాల రాంజీ,యాలకుల ధర్మ,బండారు వెంకటేష్,దుడ్డు నాగు,మోరం మోహన్,సుంకర మహేష్,గూడెపు మణికంఠ,కలిగెట్ల వీరు,పేకేటి రామకృష్ణ, వేలం పూర్ణ,వంశీ,లోకేష్,సాయి,బాబ్జి మరియు స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు.