ఎమ్పిపిఎస్ నగరంపాలెం పాఠశాలలో సంక్రాంతి సంబరాలు

ఎమ్పిపిఎస్ నగరంపాలెం పాఠశాలలో సంక్రాంతి సంబరాలు.

మధురవాడ: పెన్ షాట్ ప్రతినిధి : జనవరి 08:

మధురవాడ

ఎమ్పిపిఎస్ నగరంపాలెం పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు శరభ కళావతి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు చాలా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు, పొంగల్ వండి, భోగిమంటలు వేసి సంస్కృతిక నృత్యాలు చేస్తూ విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉల్లాసంగా సోమవారం సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు వల్ల విద్యార్థులకు సంప్రదాయ విలువలు వారికి అవగాహన వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఆర్ శ్యామల, వై ఎప్సి బాయ్, వసంత్ కుమార్, పాఠశాల సిబ్బంది మంగ తదితరులు పాల్గొన్నారు.