యు. టి.ఎఫ్. యూనియన్ ఆధ్వర్యంలో ఎస్ ఎస్ సి స్టడీ మెటీరియల్ ఆవిష్కరణ

యు. టి.ఎఫ్. యూనియన్ ఆధ్వర్యంలో ఎస్ ఎస్ సి స్టడీ మెటీరియల్ ఆవిష్కరణ.

మధురవాడ : వి న్యూస్ : జనవరి 08:

యు. టి.ఎఫ్ . సంఘం ముద్రించిన ఎస్ ఎస్ సి స్టడీ మెటీరియల్ విద్యార్థులకు ఎంతో ఉపయుక్తం అని చంద్రంపాలెం హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎం. రాజబాబు పేర్కొన్నారు. సోమవారం నాడు స్థానిక పాటశాల లో యు. టి.ఎఫ్. యూనియన్ ఆధ్వర్యంలో ఎస్ ఎస్ సి స్టడీ మెటీరియల్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా నిపునులచే రూపొందించ బడిన ఈ పుస్తకం అన్ని రకాల స్థాయిల విద్యార్థులకు ఉపయోగ పడుతున్న దని అన్నారు. దీని ద్వారా ఎక్కువ మార్కులు సాధించడానికి వీలవుతుందని పేర్కొన్నారు .విద్యార్థులకు 100కాపీలు ఉచితం గా అందించిన యు.టి.ఎఫ్. నాయకులను అభినందించారు . ఈ కార్యక్రమం లో యు.టి.ఎఫ్. జిల్లా అధ్యక్షులు దాసరి నాగేశ్వరరావు, ఏ. పి. టి .ఎఫ్ జిల్లా అధ్యక్షులు కోటాన శ్రీను, ఎస్ టి యూ జిల్లా అధ్యక్షులు పి. దేముడు బాబు, బి టి ఏ జిల్లా అధ్యక్షులు ప్రకాష్ బాబు, స్టాఫ్ సెక్రెటరీస్ రత్నారాజు, సునీత, ఆంగ్ల భాషా విద్యా నిపుణులు సోమయాజులు, స్వామి, ఉషారాణి, సోమేశ్, మోహనరావు, సంగు శ్రీను తదితరులు పాల్గొన్నారు.