కామ్రేడ్ సుబ్బారావు పార్టీ కిచేసిన కృషి మరువలేము

కామ్రేడ్ సుబ్బారావు పార్టీ కిచేసిన కృషి మరువలేము..

కూనవరం: వి న్యూస్ : జనవరి 07: 

గర్నేటి సుబ్బారావు 7 వ వర్ధంతి స్థానిక సీపీఎం. పార్టీ కార్యాలయం లో నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి నోముల సత్యనారాయణ పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా వైస్ ఎంపీపీ కొమరం పెంటయ్య, సీనియర్ నాయకులు తలగాని నాగరాజు మాట్లాడుతూ 1981కి ముందు ఆయన రెండు పర్యాయములు కూనవరం గ్రామ పంచాయతీ సర్పంచ్ గా సేవలందించారని అన్నారు.ఈ ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీ అభివృద్ధికి గ్రామ అభివృద్ధికి ఎనలేని సేవలందించారని 1964 కమ్యూనిస్టు పార్టీ చీలిక సందర్భంగా సీపీఎం వైపు ఉన్నారని పేర్కొన్నారు. స్వంత కారణాల రీత్యా కొంతకాలం సాంకేతికంగా పార్టి సభ్యునిగా కొనసాగకపోయినా పార్టీ నాయకునిగా తనవంతు బాధ్యతలు నిర్వహించారని అన్నారు .ప్రతి ఎన్నికల సందర్భంలోనూ తనవంతు బాధ్యతగా కృషి చేసేవారని,స్వీయ క్రమశిక్షణ కలిగిన మంచి నాయకుడని కొనియాడారు. అలాగే పోలవరం నిర్వసితుల సమస్య లపై తాను ఉన్నంత వరకు పోరాడారని అన్నారు.ఏ దీక్షలు చేసిన తన వంతు గా పోరాడే వారని అన్నారు.ఈ కార్యక్రమం లో గడ్డిపాటి సణ్ముఖరావు, తాళ్లూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.