పీఎం పాలెంలో జనసేన నాయకులు భారీ బైక్ ర్యాలీ, జెండా ఆవిష్కరణ.
పీఎం పాలెం: వి న్యూస్ : జనవరి 07:
విశాఖపట్నం జోన్ 2 ఆరో వార్డులో పీఎం పాలెం ఆఖరి బస్సు స్టాప్ వద్ద జనసేన పార్టీ 6 వ వార్డ్ అధ్యక్షుడు సంతోష్ నాయుడు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం భీమిలి నియోజకవర్గ ఇన్చార్జ్ పంచకర్ల సందీప్ చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ చేశారు, ఈ సందర్భంగా సందీప్ మాట్లాడుతూ స్థానికంగా లేని కార్పొరేట్ ఎన్నుకోవడం వల్ల ,ఆరో వార్డు వెనకబడిపోయిందని ,అలాగే జనసేన జెండా ఎక్కడ ఉంటే అక్కడ ప్రజలకు నమ్మకం భరోసా ఉంటాయని తెలియజేశారు, 6 వ వార్డ్ కార్పొరేటర్ ప్రియాంక స్థానికంగా మున్సిపల్ ,అంగన్వాడి ఆశ వర్కర్లు,మొదలగు వారు సమ్మెలు ధర్నాలు చేస్తుంటే, కనీసం వారికి నేనున్నానని భరోసా కూడా ఇచ్చే పరిస్థితి లో లేరని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన బీవీ కృష్ణయ్య, పోతిన తిరుమలరావు, నక్క శ్రీధర్,5వ వార్డ్ అధ్యక్షులు దేవర శివ, జనసేన వీర మహిళ పోతిన అనురాధ, సన్నియమ్మ తదితరులు పాల్గొన్నారు.
