మధురవాడ పిలకవాణిపాలెంలో అయోధ్య శ్రీరాముని పూజిత అక్షింతలు పంపిణీ.
మధురవాడ :పెన్ షాట్ ప్రతినిధి : జనవరి 07:
మధురవాడ పిలకవాణిపాలెంలో అయోధ్య శ్రీరాముని పూజిత అక్షింతలు హిందూ ధర్మ ప్రచారం సభ్యులు పసుపులేటి వాసు ఆధ్వర్యంలో 7వ వార్డ్ కార్పొరేటర్ పిళ్ళా మంగమ్మ శ్రీరామునికి పూజ నిర్వహించి అనంతరం పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమం ను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ అయోధ్యలో శ్రీ రాముని మందిరం కూల్చి 500 ఏళ్ళు తరువాత మళ్లీ అదే స్థలంలో శ్రీరాముని మందిరం నిర్మించి స్వామి వారి విగ్రహ ప్రతిష్టకు స్వామి వారిని పూజించిన అక్షింతలు దేశంలో ఉన్న ప్రజలు అందరికీ చేరే మహోత్తర కార్యక్రమం దేశ ప్రధాని నరేంద్ర మోడీ శ్రీకారం చుట్టారని ఈ కార్యక్రమంలో ఆదివారం స్వామి వారికి పూజ నిర్వహించి పూజిత అక్షింతలు గ్రామ ప్రజలకు అందించే అవకాశం కల్పించినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలుపుతూ శ్రీ రాముని కృపతో 7వ వార్డ్ ప్రజలు ఆయురారోగ్యలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా హిందూ ధర్మ ప్రచారం సభ్యులు పసుపులేటి వాసు కోరిక మేరకు మధురవాడకు చెందిన శ్రీ లక్ష్మీ నరసింహ కోలాటం బృందం అధ్యక్షులు సిరిపురపు సంతోషి, కార్యదర్శి వాండ్రాసి మంగ నేత్రుత్వంలో చిన్నారులు చేసిన అద్భుత కోలాటం నృత్యం తో స్వామి వారి ఊరేగింపు నడుమ శ్రీ రాముని పూజిత అక్షింతలు పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు చిన్నారులు చేసిన కోలాటం నృత్యం చాలా చక్కగా అద్భుతంగా చేసారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో హిందూ ధర్మ ప్రచారం సభ్యులు పిలకవాణి పాలెం గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


