ఐదవ వార్డ్ లో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన కార్పొరేటర్ మొల్లి హేమలత
మధురవాడ : వి న్యూస్ : జనవరి 04:
జీవీఎంసీ ఐదో వార్డ్ కార్పొరేటర్ మొల్లి హేమలత వార్డులో గల పలు అభివృద్ధి పనులకు ఈరోజు భూమి పూజ చేసారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ జీవీఎంసీ కౌన్సిల్ సమావేశాల్లో వార్డులో గల దీర్ఘకాలిక సమస్యలు ప్రస్తావించడం జరిగిందని అందులో భాగంగా గౌరవ మేయర్, కమిషనర్ సుమారు మూడు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. అందులో భాగంగా ముందుగా గత ఎన్నికల ప్రచారంలో ఇక్కడ పర్యటించినప్పుడు వైయస్సార్ కాలనీలో క్రింద ఉన్న బ్లాకులలో గల ఇల్లుకు చేరుకోవడానికి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని నేను గమనించానని, అందుకే ఈ ఏరియా లో మెట్ల మార్గాలు మరియు రోడ్లు పనులు మంజూరు చేయించానని, ఈరోజు కాలనీ మహిళతో కలిసి ఆ పనులకు భూమి పూజ చేసి మొదలుపెట్టడం జరిగిందని తెలిపారు.
శ్మశాన వాటికల అభివృద్ధి కి నిధులు మంజూరు
వార్డ్ లో గల మారికవలస, రాజీవ్ గృహకల్ప, సాయిరాం కాలనీ, బొట్టవానిపాలెం స్మశాన వాటికలు అభివృద్ధికి జీవీఎంసీ నిధులు సుమారు ఒక కోటి 50 లక్షలు నిధులు మంజూరు చేయించడం జరిగిందని, వాటి పనులు కూడా ఈరోజే మొదలుపెట్టడం జరిగిందని, అందులో భాగంగా ముందుగా ఈరోజు అన్ని స్మశాన వాటికల్లో బోర్లు వేయడం జరిగిందని తెలిపారు.
స్వతంత్ర నగర్ భాక్స్ కలవర్టు పనులు పరిశీలన
వార్డులో సుమారు 19.50 లక్షలతో చేపడుతున్న స్వతంత్రనగర్ కాలనీ నుండి నగరంపాలెం రోడ్డుకు అనుసంధానమయ్యే బాక్స్ కల్వర్టు పనులు ను పర్యవేక్షించి ప్రజల రాకపోకలకు అణువుగా పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు తెలియజేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వంక నూకరాజు, ఓలేటి శ్రావణ్, మొకర రవికుమార్, విష్ణు ,హరికృష్ణ, మోహనరావు , సత్యనారాయణ , రాంబాబు, లక్ష్మి , ప్రమీల దేవి, చంటి కార్యకర్తలు నాయకులు కాలనీవాసులు పాల్గొన్నారు.


