వాంబేకాలనీలో మలేరియా డెంగీ పై అవగాహన కల్పించిన జోన్2 మలేరియా ఇన్స్పెక్టర్ మంగరాజు.

వాంబేకాలనీలో మలేరియా డెంగీ పై అవగాహన కల్పించిన జోన్2 మలేరియా ఇన్స్పెక్టర్ మంగరాజు.  

వాంబేకాలనీ : వి న్యూస్ : జనవరి 05:    

జోన్2 మధురవాడ వాంబేకాలనీలో శుక్రవారం డ్రైడే ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా జోన్2 మలేరియా ఇన్స్పెక్టర్ మంగరాజు ఆధ్వర్యంలో ఏ ఎన్ ఎమ్ సూపర్వైసర్ బేబీ రాణి ఫ్రైడే ఫ్రైడే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జోన్2 మలేరియా ఇన్స్పెక్టర్ మంగరాజు మాట్లాడుతూ  నీరు, చెత్త నిల్వ ఉండటం వల్ల లార్వా ఏర్పడి దోమలు వృద్ధి చెంది మలేరియా డెంగీ జ్వరాలతో ప్రజలు అనారోగ్యాల భారిన పడుతున్నారని మలేరియా సిబ్బంది సేకరించిన లార్వాను ప్రజలకు చూపిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మలేరియా సిబ్బంది తో పాటు, ఆశా వర్కర్లు, సచివాలయం శానిటేషన్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు