గ్యాస్ లీక్ ,అగ్నిప్రమాదంలో గాయాలయ్యి ఒకే కుటుంబంలో నలుగురు చికిత్స పొందుతూ మృతి.
మధురవాడ: వి న్యూస్ ప్రతినిధి :నవంబర్ 29:
విశాఖపట్నం మహానగర పరిధి జోన్2 7వ వార్డ్ వాంబే కాలనీ బ్లాక్ 27 బి ఎఫ్ ఎఫ్ 2లో నవంబరు 24 శుక్రవారం ఉదయం 6 గంటల సమయంలో గ్యాస్ సిలిండర్ మార్చే క్రమంలో రెగ్యులేటర్ నుంచి గ్యాస్ లీకు అవుతుండగా లైట్ వేయగా మంటలు వ్యాపించాయి. ఆ ఇంట్లో నివాసం ఉంటున్న యామాల బాలరాజు 60, యామాల చిన్ని 55,యామాల గిరి 21, యామాల కార్తీక్ 20 అనే నలుగురు కుటుంబ సభ్యులు గ్యాస్ లీక్ అవ్వడంతో మంటలలో చిక్కుకున్నారు. సమయానికి 108కి స్థానికులు సహాయంతో చికిత్స నిమిత్తం కేజీహెచ్ కి తరలించారు.కేజీహెచ్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ చిన్న కొడుకు కార్తీక్ సోమవారం, పెద్ద కొడుకు గిరి మంగళవారం ఒక్కొక్కరుగా మరణిస్తూ చివరిగా తల్లిదండ్రులు కూడా తెల్లవారితే బుధవారం చనిపోవడంతో వాంబేకాలనీలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి . కుటుంబలో నలుగురు మృతి చెందడంతో వారి బంధువులు రోదనకు అంతే లేదు . నలుగురు కుటుంబ సభ్యులు పనులకు వెళ్లి జీవనం సాగిస్తూన్నారనీ భవాని దీక్షలో ఉండగా ఇటువంటి ఘోరం జరగడంతో స్థానికులు వారి సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో గ్యాస్ ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా వ్యవహారించాలని వంట చేసే సమయంలో స్టవ్ వెలిగించి వేరే పనులలో నిమగ్నం అవ్వకుండా వంట పూర్త అయ్యిన తరువాత స్టవ్ ఆపి రెగ్యులేటర్ ఆపటం ఒకటికి రెండు సార్లు చూసుకోవాలని పలువురు సూచిస్తున్నారు.

