హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరం అంటూ అవగాహన.
మధురవాడ : పెన్ షాట్ ప్రతినిధి : నవంబర్ 29:
హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపే వారిపై శ్రీ చైతన్య కళాశాల విద్యార్థులకుఅవగాహన కల్పించి అనంతరం కార్ షెడ్ జంక్షన్ కూడలి హెల్మెట్ లెస్ డ్రైవింగ్ చేస్తున్నవారికి విద్యార్థులచే అవగాహన ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో ట్రాఫిక్ ఏసీపీ జాన్ మనోహర్, నార్త్ ట్రాఫిక్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటరావు, పీఎం పాలెం ట్రాఫిక్ పీఎస్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పి.మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

