ఏపీలో ఎన్నికల వేడిని పెంచుతున్న ఎన్నికల కమిషన్
ఏపీ:వి న్యూస్: ఆగష్టు 05:
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గత నెల 23న విశాఖపట్నం కలెక్టరేట్ నుంచి జిల్లాకు 1,440 బ్యాలెట్ యూనిట్లు, 2,100 కంట్రోల్ యూనిట్లు అధికారులు తీసుకువచ్చారు.
వీటిని కలెక్టరేట్ సమీపంలో ఈవీఎం గోదాములో భద్రపరిచారు. తాజాగా జిల్లాకు 7వేల వీవీ ప్యాడ్స్ చేరుకోగా.. వాటిని కూడా అధికారులు పరిశీలించి.. గోదాముంలో ఉంచారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారులను నియమించారు. జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాలకు ప్రత్యేక ఉపకలెక్టర్‌లు, జాయింట్ కలెక్టర్, ఆర్డీవోలను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.కిందిస్థాయి సిబ్బందిపై నిఘా ఉంచి ఓటరు జాబితా పరిశీలన పారదర్శకంగా చేపట్టాలంటూ కలెక్టర్‌లకు స్పష్టం చేసింది.