భారీ వర్షానికి రహదారి అడ్డంగా పడిన పెద్ద పెద్ద బండ రాళ్లు
అల్లూరి జిల్లా,పాడేరు పెన్ షాట్ న్యూస్ ఆగస్టు 1 :-
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం,వనుగుపల్లి పంచాయితీ బంగారుమెట్ట అను గ్రామం నుండి చింతగున్నలు అను గ్రామమునకు వెళ్లే ప్రధాన రహదారిలో కొండపై నుండి పెద్ద పెద్ద బండ రాళ్లు పడ్డాయి.భారీ వర్షాలు కారణంగా రహదారికి ఆనుకొని ఉన్న కొండపై నుండి పెద్ద పెద్ద బండ రాళ్లు జారీ రోడ్డు మీద పడ్డాయి దీనివలన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఆ రహదారి మీద పడ్డ బండరాయులను తొలగించే ఏర్పాటు చేయాలని ప్రజలు ప్రయాణికులు కోరుకుంటున్నారు.