పలు వృద్ధాశ్రమoలో వృద్దులకు చీరలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన సాయి లీలా
విశాఖపట్నం: వి న్యూస్ : జూన్ 01:
విశాఖపట్నం అక్కయ్యపాలెం లో ప్రియదర్శిని వృద్ధుల ఆశ్రమం, మరియు మధురవాడ ద్రోణంరాజు కల్యాణ మండపం వద్ద ఉన్న వైజాగ్ ఓల్డ్ ఏజ్ హోమ్ లో వృద్దులకు చీరలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన శ్రీ వరసిద్ధి వినాయక శ్రీ వెంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సాయి లీలా సొంత నిధులతో వృద్దులకు గురువారం పంపిణీ చేసారు. ఆమె స్వచ్చంద సేవలో మా వంతు వృద్దులకు సహకారం అంటూ గుప్తా, రామలక్ష్మి వృద్దులకు పండ్లు పంపిణీ చేసారు. ఈ సందర్బంగా శ్రీ వరసిద్ధి వినాయక శ్రీ వెంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సాయి లీలా మాట్లాడుతూ దైవ సేవతో పాటు మానవ సేవ ముఖ్యం అని భావించి ప్రతీ ఏడాది భాగంగా గురువారం వృద్ధ ఆశ్రమాలు సందర్శించి వృద్దులకు నిత్యావసర సరుకులు చీరలు పంపిణీ చేసానని వయసు మళ్ళి, పిల్లలు ఎదిగిన తరువాత తల్లి తండ్రులను చూడక కొందరు కుటుంబ సభ్యులు ఎవరు లేక ఒంటివారిగా ఆశ్రమాల లో చేరవలసి వస్తూ ఉంటుందని అటువంటి ఆశ్రమాలు సందర్శించి వారిని కలిసి వారితో కొంత సమయం గడిపి వారిలో మేము ఉన్నామoటూ కొంత ధైర్యాన్ని నింపినట్టు ఉంటుందని నాతో మిత్రులు గుప్తా రామలక్ష్మి పండ్లు పంపిణీ చేసి వారి సహకారం అందించారని తెలిపారు.
