జోన్-2,3,4,5 పరిధిలో తాగు నీటికి అంతరాయం.
జోన్-2:వి న్యూస్ :జూన్ 02:
విశాఖపట్నం, జూన్-1:- జివిఎంసి పరిధిలో దిగువ తెలుపబడిన జోన్ల పరిధిలోని పలు ప్రాంతాలలో తాగు నీటి కి అంతరాయం కలుగునని జివిఎంసి పర్యవేక్షక ఇంజినీర్ వేణుగోపాల్ గురువారం పత్రికా ప్రకటన ద్వారా పేర్కొన్నారు. జివిఎంసి లోని టిఎస్ఆర్ ప్రాంగణంలో గల స్టోరేజ్ రిజర్వాయర్లను శుభ్రపరచుట నిమిత్తం తేది.03-06-2023న శనివారం ఉదయం 10.00 గంటల నుండి తేది.04-06-2023న శనివారం మద్యాహ్నం 1.00 గంట వరకు నీటి సరఫరాకు అంతరాయం కలుగునని, తేది.04-06-2023న మద్యాహ్నం 1.00 గంట నుండి తాగునీటి సరఫరా జరుగునని తెలిపారు.
జోన్-2 పరిధిలోని 9, 10, 11వ వార్డులలోని మధురవాడ, పిఎం పాలెం, ఆరిలోవ సెక్టార్ 1 నుండి 12 వరకు, చినగదిలి, పెదగదిలి, విశాలాక్షి నగర్, రవీంద్ర నగర్, బాలాజీ నగర్, ఆదర్శనగర్, ఎస్ ఐ జి నగర్, సుందర్ నగర్, విశాలాక్షి నగర్, డ్రైవర్స్ కాలనీ ఏరియాలు,
జోన్-3 పరిధిలోని 12 నుండి 27 వార్డులలోని చిన్నవాల్తేర్, పెద్దవాల్తేర్, పాండురంగాపురం, రేశవానిపాలెం, పిఠాపురం కాలనీ, పీతలవానిపాలెం, శివాజీ పాలెం, మద్దెలపాలెం, చైతన్య నగర్, వినాయక నగర్, మంగాపురం కాలనీ, జాలారిపేట, ఆదర్శనగర్, వాసవానిపాలెం, ఎంవిపి సెక్టార్ 1 నుండి 12 వరకు, సీతంపేట ఏరియా, అక్కయ్యపాలెం ఏరియా, లలితనగర్, శ్రీనివాస్ నగర్, ఎన్జిఓఎస్ కాలనీ, చిన్నూరు, శ్రీనివాస్ నగర్, నందగిరి నగర్, నరసింహ నగర్, గణేష్ నగర్, నక్కవానిపాలెం, క్రాంతి నగర్, గాంధీనగర్, సింహాద్రిపురం, లక్ష్మీ నరసింహ నగర్, ఓల్డ్ వెంకోజి పాలెం, దుర్గా నగర్ ఏరియాలు,
జోన్-4 పరిధిలోని 28 నుండి 39 వార్డులలోని వేలంపేట, టౌన్ మెయిన్ రోడ్, రంగిరీజు వీధి డౌన్, మoతావారి వీధి, సున్నపు వీధి, రెల్లి వీధి, జబ్బర్ తోట, చిలకపేట, అల్లిపురం ప్రధాన రహదారి, నేరెళ్ల కోనేరు రోడ్డు, అమ్మవారి వీధి, కుమ్మర వీధి, కొబ్బరి తోట, నేతాజీ నగర్, అంబేద్కర్ కాలనీ, జండా చెట్టు డౌన్, కలెక్టర్ ఆఫీస్ రోడ్డు, దండు బజార్, జాలారిపేట, సాలిపేట, కేజీహెచ్, డాబా గార్డెన్ ప్రధాన రహదారి, జగదాంబ జంక్షన్ రోడ్డు, నీలమ్మ వీధి ఏరియాలు,
జోన్-5 పరిధిలోని 41 నుండి 44 వార్డులలోని రైల్వే న్యూ కాలనీ, వెంకటేశ్వర కాలనీ, జ్ఞానాపురం, బాబు కాలనీ, సిరుల వీధి, సెభాష్టియన్ కాలనీ, జెఎన్ఎన్యుఆర్ఎం కాలనీ, సుబ్బలక్ష్మి నగర్, మoతా వారి వీధి, తాటిచెట్ల పాలెం పోర్టు, పోస్టాఫీసు ఏరియా, అబిద్ నగర్, గొల్లల పాలెం, శ్రీనివాస నగర్, నందగిరి నగర్, చెక్కుడురాయి బిల్డింగ్, దాడి రామ్మూర్తి కళ్యాణ మండపం, చాకలిపేట, టిఎస్ఎన్ కాలనీ ప్రాంతాలలో తాగునీరు నిలిపివేయడం జరుగుతుందని కావున జివిఎంసి కమిషనర్ తరపున, మంచినీటి విభాగం తరపున ప్రజలకు కలుగు అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపారు. అత్యవసరమైన ప్రదేశాలలో నీటి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయబడుతుందని పర్యవేక్షక ఇంజినీర్ తెలిపారు.

