నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ లో మైదాన ప్రాంత గిరిజనులకు అంబులెన్స్ లేవు.
ధర్మవరం: వి న్యూస్ :జూన్ 02:
మీరు సొంతంగా అంబులెన్స్ ఏర్పాటు చేసుకోండి.
నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ లో గిరిజన ప్రాణాలు అంటే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
అనకాపల్లి జిల్లా రావికమతం మండలం ధర్మవరం పంచాయతీ ధర్మవరం గ్రామం సీరగం జమ్మన్న(67) గదభ తెగకు చెందిన ఆదివాసి గిరిజనుడు. కడుపు నొప్పి తీవ్ర ఇబ్బందులు పడుతుంటే. నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ లో జాయిన్ అవ్వడం జరిగింది. ఇక్కడ వైద్యం అవకాశాలు లేవు విశాఖపట్నం కేజీకి రిఫర్ చేశారు. కేజీహెచ్ వెళ్ళడానికి మాకు డబ్బులు లేవు ఐటిడిఏ అంబులెన్స్ ఏర్పాటు చేయాలని వైద్యాధికారిని కోరగా . ఐ టి డి ఏ అంబులెన్స్ సిబ్బందికి ఫోన్ చేయడం జరిగింది. మొదట డీజిల్ లేదు అంబులెన్స్ ఉందని చెప్పారు. డీజిల్ మేం వేసుకుంటాం అంబులెన్స్ ప్రొవైడ్ చేయండి అని చెప్పగా. మేం పాడేరు మీటింగ్ లో ఉన్నాము. మీరు ప్రైవేట్ అంబులెన్స్ పెట్టుకోండి అని చెప్పారు. 108 కి ఫోన్ చేయగా అందుబాటులో లేదని చెప్పారు. దిక్కు తోచని స్థితిలో ఇతరుల వద్ద డబ్బులు అడుక్కొని ప్రైవేట్ అంబులెన్స్ లో కేజీహెచ్ వెళ్లడం జరిగింది. ప్రైవేట్ హాస్పటల్ వైద్యం చేయించగా స్కానింగ్ రిపోర్ట్ లో అన్ని చేసిన తర్వాత. ఆపరేషన్ చేయడానికి 70 వేలు ఖర్చు అవుతుందని చెప్పారు. దిక్కు తోచని స్థితిలో కేజీహెచ్ కి బయలుదేరి వెళ్లారు. నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ లో కనీసం నాన్ షెడ్యూల్ గిరిజనులకు వైద్యం అందించే దిక్కులేని పరిస్థితిలో ఉన్నది.అవసరమైతే కనీసం అంబులెన్స్ సౌకర్యం కూడా లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ లో అన్ని రకాల సౌకర్యాలని ఒకపక్క రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు ఉపన్యాసాలు చెబుతున్నారు కానీ కనీసం కడుపు నొప్పికి ఆపరేషన్ చేయడానికి ఉన్న అవకాశాలు లేకపోవడం అన్యాయం జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ లో ట్రైబల్ వెల్ సెల్ ని ఏర్పాటు చేయాలి. లేకపోతే ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం హాస్పిటల్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాము ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం జిల్లా గౌరవధ్యక్షుడు కే గోవిందరావు. గిరిజన సంఘం నాయకులు తెలుపుతున్నారు.

