తూర్పుకాపు రిసోర్స్ సెంటర్ స్థాపనకి మోహన్ కుమార్ ముందడుగు:-
విశాఖపట్నం: వి న్యూస్ :జూన్ 01:
విశాఖపట్నం లో జరిగిన ఆంధ్రప్రదేశ్ తూర్పుకాపు జేఏసీ కమిటీ సమావేశంలో ఉత్తరాంద్ర తూర్పుకాపు సామాజిక భవన నిర్మాణం కోసం తీర్మానం చేసారు. ఈ సమావేశం లో స్థల దాతలు అయినటువంటి మోహన్ కుమార్ కుటుంబ సభ్యులు స్థలం కి సంబందించిన లింకు పత్రాలని పెద్దలు సమక్షంలో సంఘం పెద్దలకి అందచేసి త్వరలోనే కమిటీ వేసి భవన నిర్మాణ పనులకి శంకుస్థాపన చేస్తామని తొందర్లోనే ఒక మంచి తూర్పుకాపు రిసోర్స్ సెంటర్ అక్కడే స్థాపించి యావత్ తూర్పుకాపు జాతికి అక్కడినుంచే సేవలు అందించి తూర్పుకాపు జాతి అభివృద్ధి కోసం పాటుపడతామణి యువజన అధ్యక్షులు గంటెడా మోహన్ కుమార్ తెలిపారు. ఈ సమావేశంలో ఆల్ ఇండియా తూర్పుకాపు అధ్యక్షులు పిసిని చంద్రమోహన్, రాష్ట్ర తూర్పుకాపు అధ్యక్షులు ఆకుల అప్పలసూరినాయుడు,జేఏసీ అధ్యక్షులు గిరడ అప్పలస్వామి, జేఏసీ కో చైర్మన్ అన్నెపు రామకృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాట్రాజు రాజారావు,రాష్ట్ర యువజన అధ్యక్షులు సేపేనా శ్రీనుబాబు, విసినిగిరి శ్రీనివాస్, ఏజ్జుపురపు శ్రీనివాస్ తదితరులు పాల్గున్నారు.
