తగరపువలసలో ముగిసిన నావల్ ఎన్ సీ సీ క్యాడెట్ల వార్షిక శిక్షణ శిబిరం

తగరపువలసలో ముగిసిన నావల్ ఎన్ సీ సీ క్యాడెట్ల వార్షిక శిక్షణ శిబిరం

తగరపువలస: వి న్యూస్ : జూన్ 01


తగరపువలస: సంగివలస అన్నిట్స్ కళాశాల క్రీడా మైదానంలో గత పది రోజులుగా జరుగుతున్న 3వ ఆంధ్రా నావల్ యూనిట్ క్యాడెట్ల వార్షిక శిక్షణ శిబిరం గురువారం ముగిసింది. ఈ కార్యక్రమానికి యూనిట్ కమాండింగ్ అధికారి కమొడార్ ఇంగ్లేశ్వర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ వార్షిక శిక్షణ శిబిరానికి విశాఖ , అనకాపల్లి , అరకు, పార్వతీపురం, విజయనగరం , శ్రీకాకుళం జిల్లాల నుంచి 200 మంది బాలికల సహా 600 మంది క్యాడేట్లు వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు , పాఠశాలల నుంచి హాజరై శిక్షణ పొందారన్నారు. ముగింపులో భాగంగా మాక్ డ్రిల్,ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు , యుద్దాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సహాయక చర్యలు, షిప్ మోడలింగ్ , ప్రాక్టికల్స్, నావల్ ఓరియంటేషన్ అంశాలపై అవగాహన కల్పించారు. టగ్ ఆఫ్ వార్, పాటలు,నృత్యాలు, ఇతర సాంస్కృతిక, క్రీడా,టెక్నికల్ అంశాలపై పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అనిట్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామకృష్ణ, పీ డీ వేణుగోపాల్ , నావీ పీ ఓ బి. అప్పల రెడ్డి, ఇతరులు పాల్గొన్నారు.