కైతపల్లి శ్రీనివాస్ చేతుల మీదుగా ఫుడ్ బ్యాంక్ ఏర్పాటు

కైతపల్లి శ్రీనివాస్ చేతుల మీదుగా ఫుడ్ బ్యాంక్ ఏర్పాటు

నీడి వెల్ఫేర్  వెంపాడ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో

తగరపువలస: వి న్యూస్ :జూన్ 02 :

భీమిలి నీడి వెల్ఫేర్ ఆధ్వర్యంలో కైతపల్లి శ్రీనివాస్ కుటుంబ సభ్యుల ధన సహాయంతో ఏర్పాటు చేసిన ఫుడ్ బ్యాంక్ శుక్రవారం ప్రారంభించారు. వి ఎస్ ఆర్ కలెక్షన్స్ దగ్గర కైతపల్లి శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభమైన  ఈ ఫుడ్ బ్యాంక్ ఫ్రిడ్జ్ ను పేద ప్రజల కోసం పూర్తి అందుబాటులో ఉండేలా చూస్తామని అన్నారు. వివిధ ఫంక్షన్స్ లో లేదా ఇతర కార్యక్రమాల్లో మిగిలిన ఆహార పదార్థాలను ఇందులో ఉంచడం జరుగుతుందని, అవసరమైన వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తీసుకోవచ్చునని ఆయన చెప్పారు. ఆహారం చాలా విలువైనదని, మన ఇళ్ళలో జరిగే వివిధ కార్యక్రమాల్లో మిగిలిన ఆహారాన్ని ఇక్కడ పెడితే ఎంతో మంది పేదవారికి ఉపయోగపడుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో భీమిలి నీడి వెల్ఫేర్ సభ్యులు వెంపాడ శ్రీనివాసరెడ్డి, వాండ్రాసి సతీష్, టి. విజయ్, కె. శ్రీను, ఎస్. అవినాష్ తదితరులు పాల్గొన్నారు.