వైస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కుంటు పడింది..మాజీ మంత్రి గొల్లపల్లి

వైస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కుంటు పడింది..మాజీ మంత్రి గొల్లపల్లి;

రాజోలు . (వి న్యూస్ ప్రతినిధి) ఏప్రిల్, 2023:

వైస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కుంటుపడిందని మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు అన్నారు. ఉయ్యురివారి మెరక గ్రామంలో గ్రామశేఖ అద్యక్షులు చెల్లుబోయిన జయసూరిబాబు ఆధ్వర్యంలో ఇదేమిఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలోమాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి సంక్షేమం ఒక్క తెలుగుదేశం పార్టీ తోనే సాధ్యం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమ అభివృద్ధి ని పూర్తిగా వదిలేసిందని, యస్, సి, బి సి కార్పొరేషన్ నిధులను ప్రక్క త్రోవ పట్టించి ఈ సామాజిక వర్గాల వారికి పూర్తిగా ద్రోహం చేసిందని అన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ సమయంలో యస్ సి లకు బి సి లకు జీవనోపాధి కొరకు లక్షల విలువైన కారులు ట్రాక్టర్లు, జే సి బి లు సబ్సిడీ పై ఇచ్చి ఆర్ధిక పరిపుష్టి సాధించే దిశగా చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తే ఈ రోజు ఏ ఒక్కరికి కూడా ఒక్క వాహనాన్ని ఇచ్చిన దాఖలాలు లేదని, కార్పొరేషన్ ల ద్వారా సబ్సిడీ లోన్ లను బడుగు బలహీన వర్గాల వారికి ఇచ్చి వ్యాపారాల పరంగా గత తెలుగుదేశం ప్రభుత్వం ప్రోత్సహిస్తే ఇప్పుడు ఒక్క రూపాయి కూడా ఇస్తున్న పరిస్థితి లేదని బి సి లకు మరియు బి సి ఉప కులాలకు ఆదరణ పథకంలో అనేక పనిముట్లను గత ప్రభుత్వం ఇవ్వగా ఆ పధకం ఈ ప్రభుత్వం లో కనిపించడం లేదని అన్నారు. యస్ సి, బి సి ప్రాంతాల్లో సామాజిక భవనాలు, సిమ్మెంట్ రోడ్ల నిర్మాణాలు ఈ ప్రభుత్వం లో చేపట్టలేదన్నారు. ఈ కార్యక్రమంలో ముప్పర్తి నాని, అడబాల సాయిబాబు, తాడి సత్యనారాయణ, సాగి పాపయ్యరాజు,కొండా శివయ్య, బళ్ల లింగమూర్తి, కొండా సత్తిబాబు, జానా పర్వతీసం, బత్తుల రవీంద్రనాధ్, యెనుముల నాగు, రాపాక అనంద్ కుమార్, రాపాక నవరత్నం, చాగంటి స్వామి, గొణిపాటి రాజు, సాగి సాయి రాజు, చెల్లింగి లీలా శ్రీనివాస్, పితాని చక్రవర్తి, నామన చంటి, అయినవిల్లి ఏడుకొండలు, జక్కంపూడి ఆదినారాయణ, యెనుముల శ్రీధర్, జిల్లెళ్ల పావెల్ రెడ్డి, అంతర్వేదిపాలెం పుల్లయ్య, కడలి వెంకటరత్నం, కొల్లు ఏడుకొండలు, కొల్లు అంజి, అంతర్వేదిపాలెం రామకృష్ణ, గుంటు పాండురంగ, కటకం పెద్ద, యర్ర నాగేశ్వరరావు, గుమ్మడి త్రిమూర్తులు, నువ్వుల త్రిమూర్తులు, పిచ్చుక విజయ, బళ్ల భాస్కరావు, కూర్మ బ్రహ్మాజీరావు, కూర్మ షణ్ముఖరావు, నల్లా సర్వేశ్వరావు, వీరా వీరబాబు, జానా భద్రరావు, దారం గోపాలం, తమ్మినీడి రమేష్, మామిడిశెట్టి వెంకట నర్సయ్య తదితరులు పాల్గొన్నారుపాల్గొన్నారు.