చిన్నకోనేల గ్రామాల మా సాగులో ఉన్న భూములు సందర్శించి సమగ్రమైన విచారణ చేపట్టాలి: ఆదివాసి గిరిజనులు
ఆదివాసి గిరిజనులు:
మాబూరుగా.చిన్నకోనేల గ్రామాల మా సాగులో ఉన్న భూములు సందర్శించి సమగ్రమైన విచారణ చేపట్టాలి - న్యాయం చేయాలి సమస్యపరిష్కారం చేయాలని కోరుతూ మోకాళ్ళపై నిల్చొని. చేతులు జోడిస్తూ వేడుకున్న ఆదివాసి గిరిజనులు.గిరిజనేతర రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు.మా భూమి కాళీ చేయమంటున్నారు ----అప్పుడే కరెంట్ సౌకర్యం కల్పిస్తామంటున్నారు.
అంతవరకు చీకట్లోనే కాలం గడపాలని బెదిరిస్తున్న భూమాఫీ-- నుండి రక్షణ కల్పించాలని కోరుతూ-
అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం రొంపెల్లి పంచాయితీ బూరిగ. చిన్నకోనేల కొండ శిఖర రెవెన్యూ గిరిజన గ్రామాలు లో 112 కుటుంబాలు కొండదొర తెగకు చెందిన ఆదివాసి గిరిజనులు జిరాయితీ భూమిపై రాగులు.సామలు.గంటలు.కొర్రలు జీడి.వరి .వంటి వ్యవసాయం ఆధారపడి జీవిస్తున్నాము. మాకు చదువు లేవు (నిరక్షరాస్యత. )
చిన్నకోనిల రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 1.2.3.4.5.6 లో మొత్తం 30 ఎకరాలు జిరాయితీ భూమి. బూరిగ రెవెన్యూ పరిధిలో సర్వేనెంబర్ 1 నుండి12 వరకు90 ఎకరాలు జిరాయితీ భూమి లో112 కుటుంబాలు సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నారు.
రైతు భరోసా పథకం మాకు రాలేదని వాలంటీర్ గారిని అడగ్గా మా భూములు రికార్డులు మార్పులు చేశారని. చెప్పడంతో ఆందోళన చెంది. ఉమ్మడి జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసాం. ఫిర్యాదు పై ఎటువంటి చర్యలు దర్యాప్తు చేయలేదు.
2020 సంవత్సరంలోROR కేసును పాడేరు సబ్ కలెక్టర్ గారి కోర్టులో కేసు వేసాం. నేటికీ దర్యాప్తు చేయలేదు.
నూతనంగా ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేశాం. మా గ్రామం వచ్చి పరిశీలి చేస్తామన్నారు. నేటికీ పరిశీలన చేయలేదు. ఈ మధ్యకాలంలో అనంతగిరి ఎమ్మార్వో మాకు భూమ్మీద ఎటువంటి హక్కులు ఉన్నాయి. నోటీసు జారీ చేశారు. రియల్ ఎస్టేట్ భూమాఫియా రెవెన్యూ అధికారులు కుమ్మక్కవి. భూములు ఖాళీ చేయాలని. మమ్మల్ని బెదిరిస్తున్నారు.
ఎస్టీ కమిషన్. జిల్లా కలెక్టర్ మా గ్రామాన్ని సందర్శించి వాస్తవాన్ని పరిశీలించాలని కోరుతున్నాము మా గ్రామానికి అయ్యే స్థాయి అధికారులు రావడం లేదు .మాకు ఈ భూముల ప్రధాన జీవనాధారం. మా గ్రామాన్ని ఖాళీ చేయాలని. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు మమ్మల్ని హెచ్చరిస్తుంది బెదిరిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు మరియు ఎస్టీ కమిషన్ మా గ్రామాన్ని సందర్శించి సమగ్ర విచారణ జరిపి భూ సమస్య పరిష్కారం చేయాలని. గిరిజనేతర్ల రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులుండి నుండి రక్షణ కల్పించాలని చేతులు జోడించి వేడుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సోముల అప్పలరాజు 10వ వార్డు సభ్యుడు. బూరిగ పెంటయ్య. బూరుగ శంకర్రావు- కోనపర్తి సింహాచలం. గిరిజన సంఘం నాయకులు సోముల సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.



 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
