బ్రహ్మశ్రీ కందుకూరి బాలసుబ్రహ్మణ్య శర్మవారి ఆధ్వర్యంలో శివునికి ప్రీతికరమైన కార్తీక మాసంలో హోమములు, కుంకుమార్చనలు.

బ్రహ్మశ్రీ కందుకూరి బాలసుబ్రహ్మణ్య శర్మవారి ఆధ్వర్యంలో శివునికి ప్రీతికరమైన కార్తీక మాసంలో హోమములు, కుంకుమార్చనలు.

మిధిలాపురి కాలనీ:

శ్రీ రామలింగేశ్వర చారిటబుల్ ట్రస్ట్ నిర్వహణలో మిధిలాపురి కాలనీ శివాలయం ప్రక్కన గల ప్రదేశంలో కృష్ణయజుర్వేద పండితులు బ్రహ్మశ్రీ కందుకూరి బాలసుబ్రహ్మణ్య శర్మవారి ఆధ్వర్యంలో శివునికి ప్రీతికరమైన కార్తీక మాసంలో హోమములు, కుంకుమార్చనలు నిర్వహించారు. విజయవాడ ఓంకార పీఠాధిపతులు, ప్రమణి స్వామి నేతృత్వంలో మిథిలాపురి ఉడాకాలనీ, శ్రీరామలింగేశ్వరస్వామి వారి ఆలయం ప్రక్కన ఉడా వారు ట్రష్టుకు కేటాయించిన కళ్యాణ మంటప నివేశన స్థలంలో మంగళవారం నుంచి గురువారం వరకు శ్రీలక్ష్మీగణపతి, శ్రీచండీ, శ్రీరుద్ర, శ్రీసుబ్రహ్మణ్య, శ్రీనవగ్రహ, నక్షత్ర హోమములు, కుంకుమార్చనలు నిర్వహణ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం గం.08.00ల నుంచి గణపతిపూజ, పుణ్యాహవాచనం, గోపూజ, యాగశాలప్రవేశం, అఖండదీపస్థాపన, పంచగవ్యప్రాశన, ఋత్విక్ వరుణ, దీక్షాకంకణధారణ, ప్రధాన కలశస్థాపన, మంటపారాధన, అగ్నిప్రతిష్ఠ, చండీహోమం నిర్వహించారని శ్రీరామలింగేశ్వర చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు మొజ్జాడ రమణ మూర్తి అన్నారు. అదేవిధంగా 2వ రోజు బుధవారం ఉదయం గం.07.00ల నుంచి గణపతిపూజ, గోపూజ, లక్ష్మీగణపతి మంటపారాధన, గణపతి చతురావర్తి తర్పణం, గణపతి హోమం నిర్వహించబడతాయని, గురువారం నాడు ఉదయం గం.07.00ల నుంచి, గణపతిపూజ, రుద్రహోమం, అభిషేకం, కుంకుమార్చనలు, శ్రీ సుబ్రహ్మణ్య, నక్షత్ర, నవగ్రహహోమం, మహాపూర్ణాహుతి, అన్నసమారాధన వంటి కార్యక్రమాలను సంపూర్ణంగా నిర్వహిస్తామని అన్నారు. భక్తులు యావాన్మంది ఈ కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ రామలింగేశ్వర స్వామి, కళ్యాణ వేంకటేశ్వర స్వామి, సుబ్రహ్మణ్య స్వామి కరుణ కటాక్షాలు పొందాలని మనసారా కోరుకుంటున్నామని అన్నారు. కళ్యాణ మండపం స్థలంలో చేపట్టిన హోమాల నిర్వహణలో మోజ్జాడ రమణమూర్తి, జ్యోతిర్మయి దంపతులు పాల్గొని హోమాలు, కుంకుమార్చనలు నిర్వహించారు. శ్రీరామలింగేశ్వర చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ధనుంజయ్ రావు, వక్కలగడ్డ వాణి, కోటేశ్వరరావు, భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.